Burra subrahmanya sastry biography

burra subrahmanya sastry news, burra subrahmanya sastry photos, burra subrahmanya sastry history, burra subrahmanya sastry biography, burra subrahmanya sastry wikipedia, burra subrahmanya sastry interview, burra subrahmanya sastry movies, burra subrahmanya sastry ladies roles

burra subrahmanya sastry biography who got a good new by playing famous ladies roles in film industry

స్త్రీ పాత్రధారణలో గొప్పపేరు సాధించిన తెలుగు నటుడు

Posted: 10/10/2014 04:04 PM IST
Burra subrahmanya sastry biography

చిత్రపరిశ్రమ చరిత్రలోనే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించి, సంచలనాలను సృష్టించిన ఎందరో కళాకారులు, నటులు వున్నారు. ప్రస్తుత సినీరంగంలో నటనకు అంతగా ప్రాధాన్యం ఇస్తారో లేదో తెలియదు కానీ.. గతంలో నటించిన ప్రముఖులు మాత్రం నటన కోసమే తమ జీవితాన్ని త్యాగం చేసేవారు. ఏ పాత్రలో అయినా పూర్తిగా లీనమైపోయి ప్రేక్షకులను ఆనందింపచేసేవారు. అటువంటి ప్రతిభావంతుల నటులలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి ఒకరు. స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు. ఈయన తన నిజరూపం కంటే ఎక్కువగా తాను పోషించే పాత్రలతోనే ఎక్కువ గుర్తింపు పొందారు.

జీవిత చరిత్ర :

1908 అక్టోబర్ 10వ తేదీన గుంటూరు జిల్లా, తెనాలిలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జన్మించారు. బాల్యంలో వుండగానే ఈయనకు నటనమీద ఎంతో మక్కువ వుండేది. ఈయన మేనమామ కోటేశ్వరరావు స్వతహాగా హరిదాసు - ఉత్తమ గాయకుడు కావడంతో.. ఆయన పర్యవేక్షణలోనే శాస్త్రి పద్యాలు, పాఠాలను శ్రావ్యంగా పాడటం నేర్చుకున్నారు. అలాగే పాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తంగా పాడటం, చిత్రకళలోని మెలకువలను తక్కువ సమయంలోనే నేర్చుకున్నారు. నటనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునే సాధించేంత స్థాయికి ఎదిగిపోయారు. ఆ సమయంలో ఈయన నటనా విశిష్థతను గుర్తించిన బి.వి. నరసింహారావు... నాట్యశాస్త్రంలో నూతన ప్రయోగరీతులన్నీ నేర్పించారు. అలా ఆ విధంగా నటనలో వున్న అనేక ప్రయోగాలను అభ్యసించిన ఈయనను.. ఆయన అన్న నాటకారంగంలో ప్రోత్సహించి.. ఉత్తమ స్త్రీ పాత్రధారిగా తీర్చిదిద్దారు.

ఇక అక్కడినుంచి మొదలైన ఈయన ప్రస్థానం.. ఆయనకు ఎంతో గొప్ప పేరును సంపాదించిపెట్టింది. ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి మొదలైన పాత్రలు ధరించి ఆంధ్ర దేశ ముఖ్య పట్టణాలలో స్త్రీ పాత్రధారణలో "ఔరా" అనిపించుకున్నారు. ఆయనే సొంతంగా సత్యసాయిబాబా నాటక సమాజం స్థాపించి... నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి ద్వారా ప్రశంసలు పొందారు. 1937లో చలనచిత్ర రంగంలో ప్రవేశించిన ఈయన.. పోతన, స్వర్గసీమ, వేమన పెద్ద మనుషులు, త్యాగయ్య, నా యిల్లు, రామదాసు వంటి చిత్రాల్లో నటించి.. తన అధ్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

శాస్త్రి నటించిన స్త్రీ పాత్రలన్నింటిలోనూ ఒక నూతనత్వం కనిపించేది. పాత్రకు తగ్గట్టుగానే ఆయన భావయుక్తమైన సంభాషణ విధానం.. ఆ విధానానికి కావలసిన సాత్విక చలనం.. ఆ చలనంతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ, సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, శృంగార రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యేట్లు నటించేవారు. ఈయన పాత్రాభినయానికి ముగ్ధులైన విశ్వనాధ సత్యనారాయణ ‘‘నాట్యాచార్య’’గానూ.. ఆంధ్రప్రజానీకం ‘‘అభినయ సరస్వతి’’గానూ.. కొండవీటి వెంకటకవి ‘‘నాట్యమయూరి’’గానూ తదితర బిరుదులు ప్రసాదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : burra subrahmanya sastry  tollywood old heroes  telugu film industry  telugu news  

Other Articles