Sachin fulfilled dreams of indian fans ajit tendulkar

Sachin fulfilled dreams of Indian fans Ajit Tendulkar, Ajit Tendulkar, Sachin Tendulkar

Sachin fulfilled dreams of Indian fans Ajit Tendulkar

సచిన్ గురించి అరుదైన నిజాలు

Posted: 11/13/2013 03:47 PM IST
Sachin fulfilled dreams of indian fans ajit tendulkar

సచిన్‌ టెండూల్కర్‌ తన బాల్యం నుంచి క్రికెట్‌కు చేసిన సేవల గురించి అతని అన్న అజిత్‌ టెండూల్కర్‌ గుర్తు చేసుకున్నాడు. బాల్యంలో క్రికెట్‌ ఆడిన తీరు, తర్వాత గొప్ప క్రికెటర్‌గా ఎదగడం, తండ్రిని కోల్పోవడం, అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ ఇన్నింగ్స్‌, రిటైర్‌ తర్వాత సచిన్‌ జీవితం వంటి అంశాలపై అజిత్‌ స్పందించాడు. కోట్లాది మంది భారత అభిమానుల కోరిక నెరవేర్చేందుకు సచిన్‌ టెండూల్కర్‌ గత 24 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడని చెప్పాడు. అనేకసార్లు మానసిక ఒత్తిడిలోనూ రాణించి అభిమానుల కోరిక నెరవేర్చాడని అన్నాడు. క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌ బై చెప్పనున్నాడన్న మాట ఏదో తెలియని విభిన్నమైన ఫీలింగ్‌ను ఇస్తోందని చెప్పాడు.

 

ఈ నెల 18వ తేదీ సాయంత్రం పరిస్థితిని తలచుకుంటే మనసులో ఏదో ఫీలింగ్‌ కలుగుతోంది. ఎందుకంటే సచిన్‌ క్రికెట్‌ గురించి కుటుంబంగా మేమెన్నో కలలు కన్నాం. ఎన్నో విషయాల్లో చర్చించాం. కానీ 18వ తేదీ వాటన్నిటికీ తెరపడనుంది. సచిన్‌ తాను కన్న కలలతో పాటు అభిమానుల కలలను కూడా నెరవేర్చాడని భావిస్తున్నాను. ఈ నెల 18వ తేదీ తర్వాత సచిన్‌ టీమిండియా క్యాప్‌ను ధరించలేడు. ఎందుకంటే 24 ఏళ్లుగా ఆ క్యాప్‌ను ఎంతో గర్వంగా ధరించేవాడు.

 

సచిన్ ఆడిన ప్రతిసారి సెంచరీ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకునే వారు. ఎంతో ఒత్తిడిలోనూ సచిన్‌ వారి కోరికను నెరవేర్చేవాడు. రిటైర్మెంట్‌ తర్వాత అటువంటి బ్యాట్స్‌మన్‌ను ఎదుర్కొనే బాధ చాలా మందికి తప్పుతుందిః అని ఓ సంస్థ నిర్వహించిన సలామ్‌ సచిన్‌ అనే కార్యక్రమం సందర్భంగా అజిత్‌ అన్నాడు. చాలా చిన్న వయసులోనే సచిన్‌ క్రికెట్‌ ధనికుడుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే సెంచరీ చేసిన ప్రతిసారీ సచిన్‌ ధనికుడయ్యాడని అజిత్‌ పేర్కొన్నాడు. పరుగులు చేసినప్పుడు ఆటోలో ప్రయాణించినా అర్థం ఉంటుందని.. పరుగులు చేయకుండా బీఎండబ్ల్యూలో ప్రయాణించినా వేస్టే అని అజిత్‌ చెప్పాడు.

 

ప్రతి మ్యాచ్‌ తర్వాత సచిన్‌ చేసిన రన్స్‌ గురించే చర్చిస్తామని.. డబ్బు గురించి కాదని తెలిపాడు. సచిన్‌ సాధించిన రికార్డులను బట్టి అతను ఎల్లప్పుడు బిలియనీరే అని చెప్పాడు. ఇప్పటి వరకు సచిన్‌ మ్యాచ్‌ను అతని కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా వీక్షించలేదు. అయితే ఇది చివరి మ్యాచ్‌ కావడంతో కుటుంబ సభ్యులతో పాటు ఇతరులతో కూడా ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు తెలిపాడు. తన తల్లితో పాటు అనేక మంది స్నేహితులు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ను ఆస్వాదిస్తారని అన్నాడు. సచిన్‌ చివరి మ్యాచ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాని చెప్పాడు. ఇన్ని ఏళ్లుగా సచిన్‌ ఆటను ప్రత్యక్షంగా ఎందుకు చూడలేదన్న ప్రశ్నకు అజిత్‌ సమాధానమిస్తూ...

 

సచిన్‌ దూకుడుగా ఆడడం వంటి కొన్ని విషయాలు మాకు భయం పుట్టించేవి. వికెట్‌ను లెక్కచేయకుండా ఆడే ధోరణి సచిన్‌ది. అయితే రాజ్‌ సింగ్‌ దుంగార్పూర్‌ ఒకరోజు మా నాన్నను పిలిచి కారును నడపడం తొలి గేర్‌ నుంచి ప్రారంభించాలని.. ఒకేసారి ఐదో గేర్‌ వేయకూడదని మీ కుమారునికి చెప్పండి అన్నారు. సచిన్‌ బ్యాటింగ్‌కు దిగేటప్పుడు మా అమ్మ ప్రార్థన చేసేంది. సోదరి ఉపవాసముండేది. నితిన్‌ (మరో సోదరుడు) కూడా ఏదో ఒకటి చేసేవాడు. ఇక నేను సానుకూల దృక్పథంతో ఉండేవాడిని. బ్యాట్స్‌మన్‌ ఒకసారి మైదానంలోకి దిగాక అతనిని ఆధీనంలో ఉంచడం ఎవ్వరి తరమూ కాదు. అయితే సచిన్‌కు దేవుడు తోడుగా ఉండలని ప్రార్థించేవాళ్లం అని అజిత్‌ చెప్పాడు.

 

తండ్రి మృతి సమయంలో....

1999లో తండ్రి మృతి చెందినప్పటి సమయాన్ని అజిత్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో నాన్న ఒక్క ఐదు నిమిషాలు జీవించి ఉంటే.. 1999 వరల్డ్‌ కప్‌ ఆడేందుకు వెళ్లమని సచిన్‌కు చెప్పేవాడు. మేలో భారత జట్టు శ్రీలంకలో ఉన్నప్పుడు నాన్నకు గుండె పోటు వచ్చింది. ఆ రోజు రాత్రి నాన్నతో మాట్లాడుతూ.. రేపు ఉదయం సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తాడని చెప్పాను. అయితే నీ ఆరోగ్యం బాగోలేదని మాత్రం సచిన్‌తో చెప్పలేదని అన్నాడు. ఆ మ్యాచ్‌లో సచిన్‌ సెంచరీ చేసిన విషయాన్ని నాన్నకు చెప్పినప్పుడు అటువంటి స్థితిలోనూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సచిన్‌ వరల్డ్‌ కప్‌లో ఆడాలని అందరం భావించాం అని అజిత్‌ చెప్పాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Soniyaghandi
Ysjreddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles