Telugu novelist dr ravuri bharadwaja special article

Telugu novelist Dr Ravuri Bharadwaja special article, Jnanpith award winner Ravuri Bharadwaja, Ravuri Bharadwaja, Eminent Telugu novelist Ravuri Bharadwaja

Telugu novelist Dr Ravuri Bharadwaja special article, Jnanpith award winner Ravuri Bharadwaja

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ

Posted: 10/19/2013 11:34 AM IST
Telugu novelist dr ravuri bharadwaja special article

ఆ సాహితీ గని ఇక కనిపించదు. మదురు వచనాలు పలికే ఆ కంఠధ్వని ఇక వినిపించదు. ప్రఖ్యాత తెలుగు సాహిత్తీ వేత్త, జ్నాన్ పిఠ్ అవార్డు గ్రహిత రావూరి భరద్వాజ ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ శుక్రవారం హైదారాబాద్ లో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు . దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్నాన్ పీఠ్ అవార్డు 2012 సంవత్సరానికి గాను ఆయనకు దక్కింది. గత శుక్రవారమే ఆయన ఆ అవార్డును స్వీకరించారు. ఆయన భార్య కాంతం 1986లో మరణించారు. సామాన్యులు, బడుగు జీవితాలు, వారి సమస్యలే ఇతివ్రుత్తాలుగా ఆయన చేసిన రచనలు సాహితీవేత్తలు, విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. ముఖ్యమంగా ‘పాకుడు రాళ్లు ’నవల ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.

రావూరి భరద్వాజ కొంత కాలంగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. హైదరాబాద్ విజయనగర్ కాలనీలో తన ఇంట్లో ఈనెల 14న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన ఆరోగ్యం పరిస్థితిపై మీడియాకు బులిటెన్ విడుదల చేశారు. కడుపులో ఇన్ పెక్షన్ మూత్రపిండాల వైఫల్యం , గుండెనొప్పి , మెడపై గాయంతో రావూరి బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయానికి పరిస్థితి మరింత విషమించింది. ఒక్కసారిగా అన్ని అవయవాలు పూర్తిగా స్పందించడం మానేశాయి. దీంతో రాత్రి 8.35 కు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపంలోని మొగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య మరియు మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక పత్రికకు ఉపసంపాదకుడైనాడు. ఆత్మాభిమానం కించపరచే ఒక సందర్భంలో తాళలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ కూడా యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.

రావూరి భరధ్వాజ గురించి చాలాకాలం పరిశోధన చేసి వారి రచనల గురించి సమగ్రమైన పరిశీలన చేసిన బొగ్గుల శ్రీనివాస్ ప్రకారం భరధ్వాజ సుమారు 187 పైగా పుస్తకాలను వెలువరించారు, 500 పైగా కథలను 37 సంకలనాలుగా, 19 నవలలు, 10 నాటకాలు వ్రాశారు. భరద్వాజ తన తొలి కథ ఒకప్పుడు ను 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశాడు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉన్నది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశాడు. త్వరలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసినచెయ్యి అనిపించుకున్నాడు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాశాడు. విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలిగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది. పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ఒడుపు అద్భుతమైనది.

రావూరి భరధ్వాజ 1948 మే 28 తేదీన శ్రీమతి కాంతం గారితో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం: రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటీశ్వరరావు మరియు పద్మావతి. ఇతని భార్య1986 ఆగష్టు 1వ తేదీన పరమపదించింది.

 

 

రావూరి భరధ్వాజ గారి నవలలు

కరిమింగిన వెలగపండు (1962)

జలప్రళయం (1963)

పాకుడురాళ్ళు (1965)

చంద్రముఖి

కాదంబరి

చిత్రగ్రహం

ఇదంజగత్ (1967)

నామీద నాకే జాలిగ వుంది

ఒక రాత్రి, ఒక పగలు

జీవన సమరం

రాజపుత్ర రహస్యం

తెలుసుకుంటూ..తెలుసుకుంటూ...

సాహస విక్రమార్క

శిధిలసంధ్య

తోడుదొంగలు

వీరగాధ

లోకం కోసం - కధల సంపుటి

ఇది నాది కాదు

ఆకళ్లు.

రావూరి భరద్వాజ 2013 అక్టోబర్ 18న తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles