Akkineni nageswara rao birthday special story

akkineni nageswara rao birthday special story, Akkineni Nageswara Rao Birthday Special 2013, Akkineni Nageswara Raos 90th birthday, Akkineni Nageswara Rao Birthday Special Manam

akkineni nageswara rao birthday special story, Akkineni Nageswara Rao Birthday Special, Akkineni Nageswara Raos 90th birthday, Akkineni Nageswara Rao Birthday Special Manam,

90లో కూడా అలుపెరగని దసరా బుల్లోడు

Posted: 09/20/2013 02:33 PM IST
Akkineni nageswara rao birthday special story

అక్కినేని అంటే తెలియని వారు ఎవరు ఉండారు. ఇప్పటి వరకు 1200 వందల అవార్డులు గెలుచుకున్న ఏకైక తెలుగు వాడు, మన దసరా బుల్లోడు అక్కినేని నాగేశ్వరరావుగారు. ఆయన వయసు 90లోకి పడినప్పటికి..ఆయన ఇంక బాలరాజుగానే ఉన్నడంటే అందరికి ఆశ్చర్యమే. నేటి హీరోయిన్లు సైతం అక్కినేని నాగేశ్వరరావు అవకాశం ఇస్తే.. ఆయన పక్కన న్యాటం చెయ్యటానికి సిద్దంగా ఉన్నారు అంటే.. ఆయన మీద అభిమానం ఎక్కడికి వెళ్లిందో ఇట్టే అర్థమవుతుంది. సహజంగా అందరు వారి జీవితం యొక్క ఫ్లస్ ఫాయింట్స్ మాత్రమే చెబుతారు. కానీ అక్కినేని మాత్రం అలా కాదు.. తన జీవితంలో జరిగిన ప్లస్ పాయింట్స్ పాటు.. మైనస్ పాయింట్స్ కూడా చెప్పి తన నిజయాతీ రెట్టింపు చేసుకున్నారు. ఈ దసరా బుల్లోడుకి ఇప్పటి వరకు ఎలాంటి ఎలాంటి రోగాలు రాకుండా హాయిగా జీవించటానికి బలమైన కారణం ఉందని చెబుతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారి తల్లిదండ్రులకు తొమ్మిదో సంతానం. తన తల్లి ఓడిలో 5 సంవత్సరాల పాటు పాలు తాగిన వ్యక్తి మన అక్కినేని నాగేశ్వరరావు. తల్లి పాలు వ్యాది నిరోధశక్తి పెంచుతాయని మన డాక్టర్లు చెబుతుంటారు. అక్కినేని 5 సంవత్సరాలు పాటు తన తల్లి దగ్గర పాలు తాగడం వల్ల ఇప్పటికి అక్కినేని ఇంక దసరాబుల్లోడు గా ఉన్నాడు. తెలుగు తెరకు పిరికి వాడుగా పరిచయం అయిన అక్కినేని.. సినీ పెద్దల అండతోనే ఈ స్థాయికి ఎదిగినట్లు అక్కినేని చెబుతున్నారు.

ఒకనోక సమయంలో అక్కినేని నాగేశ్వరరావుకు పిల్లను ఇవ్వటానికి వారి బంధువులే ఇష్టపడలేదు. కారణం ఒక్కటే అక్కినేని సినిమా హీరో కావటమే. అప్పట్లో సినిమా హీరో అంటే.. ఒక చెడ్డ వ్యక్తిని చూసినట్లుగా ఉండేది. సినిమా హీరోను పెళ్లి చేసుకుంటే.. ఆ కుటుంబం నాశనం అవుతుందనే ఉద్దేశంతో అక్కినేని నాగేశ్వరరావుకు పిల్లను ఇవ్వటానికి ఎవరు సాహసం చెయ్యలేదు. ఆ సమయంలో నాగేశ్వరరావు తల్లి ఎంతో తల్లడిల్లిపోయింది. తల్లి బాధను అర్థం చేసుకున్న అక్కినేని.. తల్లికి ఒక శపథం చెయ్యటం జరిగింది. సినిమా హీరోగా ఉన్నప్పటికి ఎలాంటి చెడు అలవాట్లుకు లోను కానని, ఎంత సంపాదించిన, నీతి, నిజయితీగా ఉంటానని తన తల్లికి మాట ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దసరా బుల్లోడు .. కొన్ని సుఖాలకు దూరంగా ఉండటం జరిగింది. అంటే రాముడుగానే ఉన్నాడని, ( శ్రీక్రిష్ణుడు లాంటి సుఖలకు అక్కినేని దూరంగా ) అర్థం. అయితే అక్కినేని జీవితంలో కొన్ని అద్బుతమైన ఘట్టాలు జరిగినట్లు చెబుతున్నారు. మద్రాస్ నుండి హైదరాబాద్ రావటానికి ముఖ్యకారణం ఉందని అక్కినేని అంటున్నారు.

ఆరోజుల్లో.. అక్కినేని, ఎన్టీఆర్ మద్య మంచి స్నేహబంధం ఉండేది. కానీ కొంతమంది సినీ పెద్దలు, హీరోయిన్స్ వల్ల వీరి మద్య వైర్యం వచ్చినట్లు అప్పట్లో పుకార్లు మద్రాస్ లో షికార్లు చేశాయి. తన కొడుకులు కోసమే హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో పెట్టడం జరిగింది. అప్పట్లో మద్రాస్ లో తెలుగు స్కూల్స్ లేవు. తన కొడుకులు కోసం, వారికి తెలుగు మాట్లాడటం, చదవటం, రాయటం కోసమే, అక్కినేని కుటుంబాన్ని మద్రాస్ నుండి హైదరాబాద్ కు మార్చటం జరిగింది. తండ్రి వయుసులో ఏ విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాడో.. తాత వయసులో కూడా అలాగే తన కుటుంబం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ 90 ఏళ్ల దసరా బుల్లోడు. అక్కినేని, ఒక బాలరాజుగా, ప్రేమికులకు దేవదాసుగా, భకులకు, విప్రనారాయణగా, మహా కాళదాసుగా, యవ్వనంలో ఉన్న కుర్రోళ్లకు.. దసరా బుల్లోడుగా, అమ్మాయిలను ప్రేమనగర్ వైపు నడించిన, బాటసారిగా, చాణక్య చంద్రగుప్త గా, చివరకు సీతారామయ్యగారి మనవరాలు తో తెరపై ఎన్నో విన్యాసాలు, ఎన్నో ప్రయోగాలు, చేసిన నూతన కళకారుడు అక్కినేని నాగేశ్వరరావు. 90లోకి అడుగు పెట్టినప్పటికి.. ఆయన ముఖంపై మేకప్ ఛాయలు ఏమాత్రం పోలేదు. తండ్రి,కొడుకు, మనవడు లు కలిసి టాలీవుడ్ తెరపై సందడి చెయ్యటానికి ‘మనం ’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా తెలుగువిశేష్.కామ్ శుభాకాంక్షలు తెలుపుతుంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles