ఈ జీవితం జీసస్ ఇచ్చిందే..
1985లో జరిగిన ప్రమాదం నుంచి నేను ప్రాణాలతో బయటపడ్డాను అంటే అది కేవలం జీసస్ కరుణతోనే.. నీటి లో మునిగిపోతున్న నాకు ఆ కరుణామూర్తి కనిపించి.. రక్షించారు. అప్పటినుంచి నేను జీసస్‌ను నమ్ము తున్నాను. పేదవారికి, సహాయం అవసరమైన వారికి చేయూ తనిస్తు న్నాను. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
కమల్‌తో కలిసి బాలనటిగా..
పండంటి కాపురం సినిమా మంచి హిట్ కావడంతో.. ఆ సిని మాలో చిన్నపాత్ర వేసిన నాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో బాలనటిగా నటించాను. బాలచందర్ గారు తీసిన సినిమాలో నేనూ, కమల్ హాసన్ అన్నాచెల్లెళ్లుగా నటించాం. హిందీ సినిమా 'ఆయేనా' లో కూడా బాలనటులుగా కలిసి నటించాం. బాలచందర్‌గారు తీసిన తమిళ సినిమా 'అపూర్వ రాగంగళ్' లో కమల్, నేను, శ్రీవిద్య ప్రధాన పాత్రల్లో నటించాం. 'లక్ష్మణరేఖ' సినిమా నా జీవితంలో టర్నింగ్ అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'జ్యోతి' నా కెరీర్‌ను పరుగులు పెట్టించింది.
సుజాత నుంచి జయసుధగా ..
తమిళంలో మంచినటిగా పేరుతెచ్చుకున్న తరువాత.. తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే.. అప్పటికే సినీ పరిశ్రమలో మలయాళం నుంచి వచ్చిన సుజాతగారు ఫేమస్ అయ్యారు. మరో సుజాత ఎందుకని.. తమిళదర్శకుడు గుహ నాథన్ నా పేరును జయసుధగా మార్చారు. నేను నటించిన సినిమాలు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. రెండువందలకు పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. ఇప్పటివరకు నటించిన అన్నీ సినిమాలు కలిపి 350పైనే ఉంటాయి. పాత్రలో నటించడం కన్నా.. ఆ పాత్రే నేనుగా మారి పోయేదాన్ని. కుటుంబకథా చిత్రాల ఎక్కువ కావడంతో.. ఆ పాత్రల్లో ఇమిడిపోయేదాన్ని. ప్రేక్షకుల ఆదరణతో సహ జనటిగా వారి అభిమానం పొందాను.
గ్లామర్ అనేది కొద్దిరోజులే..
ప్రకృతిసిద్ధంగా మనిషిలో వయసుతో పాటే మార్పులు వస్తాయి. వయస్సును, మార్పులను ఎవ్వరూ ఆపలేరు. సినిమా రంగంలో గ్లామర్‌కే అగ్రస్థానం. అలా అని హీరో, హీరోయిన్‌లకే ఆదరణ ఉంది, మిగతా ఆర్టిస్ట్‌లకు అభిమానులు లేరు అనడం సరికాదు. ఈ రోజు ల్లో కమెడియన్‌లకు ఎంతో మంది అభిమానులున్నారు. అయితే వయసుకు తగ్గ పాత్రలు చేస్తే.. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. అభిమానిస్తారు.
వందలాది సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా.. కొద్ది కాలం తరువాత హీరోయిన్ పాత్రలు వేయడం సరికాదనిపించింది. ఇల్లు, పిల్లల పెంపకంలో బిజి అయ్యే సమయంలో వచ్చిన 'ఆంటీ' సినిమా కొత్త తరహాలో సాగింది. ఆ తరువాత వచ్చిన 'అమ్మా.. నాన్నా.. ఓ తమిళమ్మాయి' మంచి హిట్ అయ్యింది.
వయసుకు తగ్గట్లుగా వేసిన తల్లిపాత్రలో
'బొమ్మరిల్లు',' సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు' తదితర సిని మాల నుంచి ఇప్పుడు విడు దల కు సిద్ధంగా ఉన్న 'ఎవడు ' వరకు చాలా సిని మా ల్లో తల్లిపాత్ర వేశాను. వయసుతో పాటు పా త్రలు మారితే.. ప్రేక్షకుల మదిలో చిర కాలముంటాం.
దాసరి దర్శకత్వంలోచాలా సినిమాలు..
దర్శకరత్న దాసరిగారి దర్శకత్వంలో చాలా సినిమాల్లో నటించాను. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే నితిన్‌కపూర్ (హిందీనటుడు జితేంద్ర కజిన్)తో పరిచయం నిజజీవితంలో మరో మలుపు. మా పెళ్లి పెద్దల అంగీకారంతోనే జరిగింది. ఆ తరువాత కూడా చాలా సినిమాల్లో నటించాను. పిల్లల చిన్నప్పుడు మా త్రమే కొద్దిరోజులు సినిమాలకు దూరం గా ఉన్నాను. ఆ తరువాత 'ఆంటీ' సిని మాతో మళ్లీ బిజి అయ్యాను. నిర్మా తగా కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసు కువచ్చాం. పిల్లల చిట్టి పొట్టి మాటలు, తడబడే అడుగులు, చిలిపిచేష్టలు మిస్ అవుతున్నాను అని పించేది. కాని, కష్టపడేది వారి భవిష్యత్ కోసమే కదా అని నాకునేనే సమాధానం చెప్పుకునేదాన్ని.
అనుకోకుండా రాజకీయాల్లోకి..
సినిమాల్లో నచ్చిన పాత్రలు వేస్తూ ఖాళీ సమయంలో షైన్ డెవలప్‌మెంట్ ట్ర స్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, టి . వీ షో నిర్వహిస్తున్న సమయంలో నాలోని సేవా భావాన్ని గమనించి కాంగ్రెస్‌పార్టీలోకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించారు. నాకు రాజకీయాలు తెలి యవు.. ఆసక్తికూడా లేదు అని చెప్పాను. మీలో సేవాభావం ఉంది. రాజకీయాల్లోకి వస్తే మరింత మందికి సేవచేసే అవ కాశం ఉంటుంది అని ఆయన అన్నారు. సరే ఆలోచించి చెబు తాను అని కాస్త సమయం తీసుకున్నాను. మా వారితో ఆలో చించాను. ప్రజాసేవ చేయడానికి జీసస్ నాకు ఇస్తున్న అవ కాశంగా అనిపించింది. నేను సరే అన్న పదిహేను రోజుల్లోనే ఎన్నికలు రావడం.. సికింద్రాబాద్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం అంతా చకచకా జరిగిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ప్రజలకు ముఖ్యంగా పేదవారికి మంచి జరగాలంటే ప్రభుత్వంలో భాగమైతే మరింత సులభమవుతుంది అనిపిం చింది. అంతే రాజకీయాల్లో ఓనమాలు తెలియకుండానే.. ఎన్నికల ప్రచారం.. ప్రజాప్రతినిధిగా విజయం, శాసనసభ్యు రాలిగా ప్రమాణస్వీకారం అంతా సినిమారీల్లా సాగిపోయింది.
అధికారులు.. సేవాతత్పరులు..
రాజకీయనాయకులు ప్రజలకు మంచి చేస్తే ఎక్కువ కాలం.. త మ స్వార్థం చూసుకుంటే తక్కువ కాలం.. పదవుల్లో ఉంటారు. ప్రభుత్వాధికారులపై పెత్తనం చూపించే ప్రజా ప్రతి నిధులను చాలామందిని గమనించాను. నిజానికి ఐఎఎస్, ఐపిఎస్ స్థాయి అధికారుల్లో అధికశాతం మంది ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తారు. విజయ వంతంగా అమలుచేస్తారు. లక్షల్లో జీతాలు, టెన్షన్‌లేని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను వదిలి ఎంతో మంది పబ్లిక్ సర్వెంట్లుగా పనిచేస్తున్నారు. కాని, రాజకీయనాయకులే తమ స్వార్థం కోసం అధికారులను బదిలీలు చేస్తూ.. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తారు. ఈ విషయాలు చాలా ఆలస్యంగానైనా కూలంకుషంగా తెలుసు కున్నాను. అధికారులకు ప్రజా ప్రతి నిధులకన్నా ఎక్కువగా ప్రజాసమస్యలపై, పరిష్కారాలపై అవగాహన ఉంటుంది. ఎమ్మెల్యే అయిన కొత్తలో కొంతమంది చెప్పేవాళ్లు.. ఆఫీసర్లు వినడం లేదని.. వారినే అడిగితే.. ఎలా చేస్తే సమస్య పరిష్కారం అవు తుందో వివరించేవాళ్లు. ప్రజలు వారి సమస్యలను చెబుతారు.. వాటిని పరిష్కరించాలని మేం ప్రయత్నిస్తాం.. కాని, అంతి మంగా అధికారులు ముందుకు వస్తేనే.. త్వరగా పరిష్కారం అవుతాయి. అందుకే అధికారులపై ఒత్తిడి పెంచడం కన్నా.. వారికి స్వేచ్ఛనివ్వడం మంచిది. ఇప్పుడిప్పుడే.. నా నియో జకవర్గంలో ప్రజలనుంచి అందిన ఫిర్యాదులన్నీ.. అధికారుల సహకారంలో పరిశీలిస్తూ.. పరిష్కరిస్తున్నాం.
రాజకీయాల్లో లేదా సామాజిక సేవలో..
ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను. ప్రజా సేవ చేయాలని వచ్చాను. పిలిచి టిక్కెట్ ఇచ్చారు. విజయం సాధించి.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తాను. లేదా సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉంటాను.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more