Ntrs raktha sambandham movie

NTR Raktha Sambandham,NTR Raktha Sambandham movie,Raktha Sambandham,Raktha sambandham completes 50 years,Raktha Sambandham movie,Raktha Sambandham stills, ntr.

NTR Raktha Sambandham movie completes 50 years.

NTRs Raktha Sambandham.png

Posted: 11/06/2012 01:16 PM IST
Ntrs raktha sambandham movie

NTRs_Raktha_Sambandham_

మనసుతో చూసినట్టయితే, మన తెలుగు నాట, ఇంచు మించు ప్రతీ సినిమాలో ఏదో ఒక సందేశం మిళితమయి ఉంటుంది, అది మన మనస్సుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఇలాంటి ఆణిముత్యాలు, నాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో. అయితే, నేటికి అన్న - చెల్లెలి అనుబంధాన్ని కధాంశంగా చేసుకుని ఎన్ని సినిమాలు ఒచ్చిన, వీటన్నిటికి ప్రేరణ ఈ ఆణిముత్యం... అదే, అన్నా - చెల్లెలి అనుబంధానికి, మానవ సంబంధాలకి అడ్డం పట్టే 'రక్త సంబంధం'... ఈ మధ్యనే, ఈ చిత్రం యాభై సంవత్సరాల విడుదలని పూర్తీ చేసుకుంది. యన్. టీ. ఆర్ - సావిత్రిగార్ల అద్భుతమైన నటనకు ప్రతీకగా నిలిచే ఈ చిత్ర విశేషాలు, కొన్ని...

అప్పటి తరం నిర్మాతల్లో అగ్ర స్థానం లో ఒకరైన డూండీ గారు, ఒక తమిళ సినిమా చూసి, ఆ సినిమాను తెలుగు లో రీమేక్ చేయ్యాలనుకున్నారు. ఆ ఆలోచనకు కార్య రూపం ఇవ్వాలని, మధుసూదన రావు గారిని దర్శకుడిగా ఎన్నుకున్నారు... ఇక అన్నా - చెల్లెలు గా ఈ సినిమాలో ఎవరిని నటిమ్పచేయ్యాలనుకుంటే ముందుగా దర్శక - నిర్మాతలకి ఏ. యన్. ఆర్ - సావిత్రిగారు స్పృహలోకి ఒచ్చారు... సావిత్రి గారు సరే అన్న, ఏ. యన్. ఆర్ మాత్రం, 'నన్ను - సావిత్రి గారిని అన్నా చెల్లెలు గా ప్రేక్షకులు స్వీకరించారు, అయిన ఇటువంటి పాత్రకు యన్. టీ. ఆర్ అయితేనే న్యాయం చెయ్యగలరు' అని సలహా ఇచ్చారట... ఇంకేముంది, యన్. టీ. ఆర్ కూడా సరే అనడం తో, దర్శక - నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు... ఇక, సావిత్రి గారి సరసన ఎవరు నటిస్తే బాగుంటుంది అని ఎన్నో పేర్లు పరిశీలించిన తరువాత, కాంత రావు గారిని ఎంపిక చేసారు. యన్. టీ. ఆర్ సరసన దేవిక గారితో సహా, రేలంగి గారు, సూర్యకాంతం గారు వంటి ఇతర తారాగణం ఎంపిక జరిగిపోయింది.

ntr_raktha_sambandam

ఈ చిత్ర కథ అనుసారం, మాటలు కూడా అంటే బలంగా ఉండాలి... ఆత్రేయ గారు తప్ప దీనికి ఇంకెవ్వరు న్యాయం చెయ్యలేరు అని అందరు ఆలోచించారు, కాని నిర్మాత డూండీగారు మాత్రం, పత్రికలలో వ్యాసాలూ రాసే ముళ్ళపూడి వెంకటరమనగారికి ఈ బాధ్యాత ఇద్దాం అన్నారు... రమణగారు, వ్యంగ్యం, హాస్యం బాగా రాస్తారు, కాని సెంటిమెంట్ ని మాటలలో పందిన్చాగరాల అని అందరి సందేహం. కాని, 'నువ్వు నీ ఎదుగుదలకి పునాదులు, వారి పతనానికి, గోతులు తవ్వుతున్నావు'... 'నిన్ను వదలి వెళ్ళడం లేదమ్మా... ఇల్లు వదిలి వేలుతున్నానంటే' వంటి ఎన్నో సంభాషణలు, ప్రేక్షకుల నీరాజనాలు పొంది, చిత్ర కథలో కీలక భాగం పోషించాయి.ఈ చిత్రం లో గడ్డం కింద చెయ్యి పెట్టుకుని చిరుమందహాసం తో ఉన్న యన్. టీ. ఆర్. ఫోటో మనకు కనిపిస్తుంది... చిత్రం విడుదల అయిన తరువాత, అభిమానులు ఈ ఫోటోని తమ ఇంట్లో పెట్టుకున్నారట... ఇప్పటికి ఈ ఫోటో, యన్. టీ . ఆర్. పెద్ద అబ్బాయి, హరి కృష్ణ గారి ఇంట్లో ఉంటుంది...

ఈ చిత్రం లోని పాటలు కూడా అత్యంత ప్రేక్షకాదరణ పొందినవే... ఘంటసాల మాస్టర్ సంగీతం అందించిన స్వరాలన్నీ, తమిళ మాతృక నుండి  నిర్మాత ఒత్తిడి వల్ల... అయిన, మన తెలుగు వారి ఇష్టానుసారం, స్వరాలని సవరించారు, ఘంటసాల మాస్టర్... 'బంగారు బొమ్మ రావేమే', 'చందురుని మించు, అందమొలికించు' అనే పాటలు, ఇప్పాటికి, మన ఇంట జరిగే ఎన్నో వేడుకలలో వినిపిస్తూనే ఉంటాయి. వేటూరి గారి మాటలు, ఈ పాటలకి జీవం పోశాయి...ఇలా, అన్ని అంశాలు మిళితమై, 'రక్త సంబంధం' చిత్రం ఈనాటికి మన మనస్సులో నిలిచిపోయే చిత్రంగా మిగిలిపోయింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bal thackeray life history
Tdp yerram naidu political history  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles