Ramoji raos son suman passed away

Ramoji Rao's son Suman passed away

Ramoji Rao's son Suman passed away

Suman.gif

Posted: 09/07/2012 12:29 PM IST
Ramoji raos son suman passed away

sumanramoji

suman

రచయితగా , దర్శకుడిగా, నటుడిగా , బహుముఖ స్రుజనశీలిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన సీహెచ్. సుమన్ గురువారం రాత్రి 12.18 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 45 సంవత్సరాలు . నాలుగైదేళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన కొద్ది నెలలుగా హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామేజీరావు రెండో కుమారుడైన సుమన్ 1966 డిసెంబర్ 23న జన్నించారు. ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఒక పాప, ఒక బాబు, భార్య విజయేశ్వరి రామేజీ గ్రూపు సంస్థల్లో భాగమైన డాల్పిన్ హోటల్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. సుమన్ అంత్యక్రియలు శుక్రవారం రామేజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.sumanch

బహుముఖ ప్రజ్ఞాశాలి.. సుమన్

చదువుకు స్రుజన తోడైతే రాణింపు ఎలా ఉంటుందో చెప్పేందుకు ఉదాహారణ సుమన్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారాయన. చదువులో ఎప్పుడూ ముందు వరుసులోనే ఉంటేవారు. పాఠశాల విద్య స్థాయిలోనే ఆయనకు పాత్రికేయ వ్రుత్తిపై ఆసక్తి కలిగింది. ఆ దిశగానే పని చేశారు. నిజామ్ కాలేజీలో బి.ఎ. చదివారు. రాజునీతి, అర్థ శాస్త్రం, ఆంగ్లం ప్రధానాంశాలుగా డిగ్రీ చదివారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.సి.జే చదివారు. జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఆమెరికా వెళ్లారు. జర్నలిజంలో ఇంటర్న్ షిఫ్ ను ‘ఈనాడు’లో చేశారు. ఈనాడు పత్రికలోని జనరల్ డెస్క్ లో పని చేశారు. వివిధ సందర్భాల్లో ఈనాడు సంపాదకీయం పేజీకి అరవై ప్రత్యేక వ్యాసాలు రాశారు.

suman1

దిగ్గజాల శిష్యకరింలో

చిన్నప్పటి నుంచీ తెలుగు భాషంటే సుమన్ కు మక్కువ ఎక్కువ. కుమారుడి ఆసక్తిని గమనించిన రామేజీరావు ప్రముఖ కవి కొండవీటి వేంకటకవి దగ్గర శిష్యుడిగా చేర్చారు ఏడేళ్లపాటు ఆయన శిష్యరికంలో తెలుగు భాషపై సాధికారికత తెచ్చుకొనేందుకు క్రుషి చేశారు. బాల వ్యాకరణం, ప్రౌడ, వ్యాకరణం, నీతి చంద్రిక , శతకాలు, వసుచరిత్ర, మనుచరిత్ర, లాంటివి ఆయన వద్దనే చదువుకున్నారు. వేంకటకవి వద్ద సంస్ర్కుత భాషతో కూడా పరిచయం పెంచుకున్నారు. అమెరికాలో విద్య పూర్తి చేసుకొని వచ్చిన తరువాత జర్నలిజంలో కొనసాగారు. ఆ సయయంలో ప్రముఖ సినీ రచయిత డి.వి. నరసరాజుతో సన్నిహితంగా మెలిగారు. పుస్తక రచన, స్ర్కీన్ ప్లే లాంటి అంశాలపై నరసరాజుతో సుదర్ఘీంగా చర్చించేవారు. సుమన్ రచనలు, అమెరికా అదుర్ ష్టం, సభ్య సమాజం, తదితరాల్లో అచ్చ తెలుగు హాస్యం తొణికిసలాడింది.

suman2
సుమన్ ఇంటింటి టీవీ

సుమన్ మేనేజింగ్ డైరెక్టర్ గా 1995 ఆగస్టు 27న ‘ఈటీవీ’ ప్రారంభమైంది. ఈటీవీని ఇంటింటి టీవీగా తీర్చిదిద్దడంలో ఆయన అవిరళ క్రుషి సలిపారు. కేవలం ఛానెల్ నిర్వహణకే పరిమితం కాకుండా స్రుజనాత్మక విభాగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ‘అంతరంగాల’ ‘లేడి డిటెక్టివ్’, ‘స్నేహం’ , ‘ఎండమావులు’, ‘కళంకిత’ లాంటి ధారావాహికలు ప్రేక్షకుల్ని ఎంతగానో రంజింపజేశాయి. ఆ ధారావాహికలకు కథ, మాటలు, పాటలు, స్ర్కీన్ ప్లే ఆయనే సమకూర్చేవారు. దర్వకత్వం మీదా సుమన్ కి సాధికారత ఉంది. అన్ని వయసులవారినీ, అన్ని వర్గాల వారినీ మనసులో ఉంచుకొని కార్యక్రమాల్ని రూపొందించారు. ‘‘ కార్యక్రమాల రూపకల్పనలో నా వ్యక్తిగత అభిరుచులకు చోటుండదు. ప్రేక్షకుల అభీష్టానికే పెద్ద పీట ’’ అనే వారు సుమన్. తన రచనలో గానీ, ధారావాహిక లోగానీ, ఎక్కడా అశ్లీలత, ద్వంద్వార్థాలు , మితిమీరిన హింసకు తావు లేకుండా జాగ్రత్త పడేవారు. ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలను ఆయన ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొనేవారు. అవసరాన్ని బట్టి మార్పు చేర్పులు చేయించేవారు. ఆయన ఎక్కువగా వినోదాన్ని ఇష్టపడేవారు. దాంతో పాటు కుటుంబ బంధాలు , తెలుగుధనం నిండిన వాతావరణాన్ని తన ధారావాహికలల్లో కనిపించేలా చూసుకొనేవారు. సుమన్ కి చిత్రలేఖనంలో మూడోయేట నుంచే మక్కువ. ఆయన ఆసక్తి చూసి రామోజీరావు చిత్రకళకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను అంధించారు. జవహర్ బాలభవన్ లో నిర్వహించే పోటీలో ఆయన అనేక బహుమతులు అందుకున్నారు. కార్టూనిస్ట్ శ్రీధర్ దగ్గర కొన్ని మెలకువలు తెలుసుకున్నారు. సందర్భాన్ని బట్టి విపుల, చతుర మాస పత్రికలకు సమన్ బొమ్మలు గీసేవారు. తన సీరియళ్లకు అవసరమైన వర్ణచిత్రాలను ఆయనే గీసేవారు. తన సారథ్యంలో నిర్మాణమై, ప్రేక్షకులను అశేషంగా ఆకట్టుకున్న పలు సీరియళ్లకు నంది పురస్కారాలు అందుకున్నారు. తన సీరియళ్ల ద్వారా ఎంతోమంది కళాకారులను పరిచయం చేశారు.

sumanch5వెండితెరపైన సుమన్

‘ఉషాపరిణయం’ చిత్రంతో సమన్ తనదైన ముద్రతో వెండి తెరపైనా కనిపించారు. దానికి ఆయనే దర్శకత్వం వహించారు. భాగవత గాధతో అల్లుకొన్న పౌరాణిక చిత్రమిది. ఇందులో ఆయన శ్రీక్రిష్టుడిగా నటించారు. ఆ తరవాత పూర్తిస్తాయి వినోదాత్మక చిత్రం ‘నాన్ స్టాప్’ రూపొందించారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ఈ చిత్రంలో కథానాయకుడిగానూ నటించారు. ఆధ్మాత్మిక భావనలు మెండుగా ఉన్న సుమన్ ‘శ్రీహరిస్వరాలు’ పేరుతో భక్తి గీతాల ఆల్బమ్ ని రూపొందించారు. తను రాసిన గీతాలకు బాణీలు కూడా ఆయనే కట్టారు. నాయనమ్మ వెంకట సుబ్బమ్మ ప్రభావం సుమన్ పై ఉంది. చిన్నతనంలో నాయనమ్మ చెప్పిన పౌరాణిక కథలు ఆయనపై చెరగని ముద్రను వేశాయి. శ్రీహరిస్వరాలు రాసినా, పౌరాణిక చిత్రాలు తీసినా, పౌరాణిక పాత్రలు వేసినా ఆమె చెప్పిన కథలే తనకు స్పూర్తి అనేవారు సుమన్ . ఆయన ఈ లోకంలో లేకపోయిన ఆయన రచనలు, పాటలు, నటన , తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles