Interview with saina nehwal

Badminton sensation and world No-6, Saina Nehwal is the first Indian woman to reach the singles quarterfinals at the Olympics

Badminton sensation and world No-6, Saina Nehwal is the first Indian woman to reach the singles quarterfinals at the Olympics

Interview with Saina Nehwal.gif

Posted: 06/19/2012 05:43 PM IST
Interview with saina nehwal

Saina-Nehwal-Interview

Sinaబ్యాడ్మింటన్ లో తన సత్తా చాటుతూ.. మన దేశానికే కాదు... రాష్ట్రానికి మంచి పేరు తెస్తూ..., బ్యాడ్మింటన్ లో చైనా ఆధిపత్యానికి గండి కొట్టి మూడోసారి ఇండోనేషియా టైటిల్ నెగ్గిన మన ఆణిముత్యం సైనా నెహ్వాల్ . ఇండోనేషియా టైటిల్ విజయంతో లండన్ ఒలంపిక్స్ లో స్వర్ణం తేవడమే తమ లక్ష్యం అని చెబుతున్న సైనా నెహ్వాల్ కాసేపు చెప్పిన విషయాలు... మీకోసం.

ఒలంపిక్స్ ముందు ఇండోనేషియా ఓపెన్ విజయం మీకు ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తోంది ?

అధ్బుతమైన విజయమిది. లండక్ ఒలంపిక్స్ కు ముందు కొండంత ఆత్మవిశ్వాసం లభించింది. ఇండేనేషియా ఓపెన్ నాకు బాగా కలిసొచ్చిన వేదిక. 2009,2010లో టైటిళ్ళు గెల్చుకున్నా... 2011లో రన్నరప్ గా నిలిచా. ఈసారి మళ్ళీ టైటిల్ సాధించా. ఇండోనేషియాలో ఎప్పుడు మ్యాచ్ ఆడినా టైటిల్ గెలుస్తామన్న నమ్మకంతో కోర్టులో అడుగుపెడతా.. ఆ ఆత్మవిశ్వాసం కీలక సమయాల్లో పనికొచ్చింది. ఒలంపిక్స్ లో మరింత బాగా ఆడేందుకు ఈ విజయం దోహదం చేస్తుంది.

తొలిగేమ్ ఓడిపోయి..... రెండో గేమ్ ఆడేటప్పుడు మీ మదిలో ఎలాంటి ఆలోచనలు మెదిలాయి. ఆ సమయంలో మ్యాచ్ గెలుస్తానని భావించారా ?

18-20 తో వెనకబడి ఉన్న సమయంలో నాలో నేను అనుకున్న ఒకటే మాట... ‘ఎలాగైనా గెలవాలి... ఓడిపోవద్దనే శక్తి మేరకు ఆ గేమ్ ను కాపాడుపోవడానికి ప్రయత్నించా. గేమ్ తో పాటు మ్యాచ్ ని గెల్చుకొని టైటిల్ అందుకున్నా.... ఈ టైటిల్ దేవేడిచ్చిన కానుక. ఈ మ్యాచ్ లో దాదాపుగా ఓడిపోయానని అనుకున్నా. ఆ దశ నుంచి బయటపడి విజయాన్ని అందుకున్నా. నేను నమ్మే దేవుడు... నా కోచ్, తల్లిదండ్రులకు ధన్యవాధాలు.

ఇద్దర అగ్రశ్రేణి చైనా క్రీడాకారులను ఓడించిన నేపధ్యంలో ప్రపంచ బ్యాడ్మింటన్ లో మీ ఆధిపత్యం మొదలైనట్లేనా ?

ఇండోనేషియా విజయమే సంకేతం. ఏ టోర్నీకెళ్లినా ఇద్దరు లేదా ముగ్గురు చైనా క్రీడాకారులు ఉంటారు. వాళ్ళను ఓడించనిదే టైటిల్ గెలవడం సాధ్యం కాదన్న సంగతి తెలిసింది. కొన్ని సార్లు వాళ్ళను ఓడించా. కొన్ని సార్లు వాళ్ళు నన్ను ఓడించారు. ఇండోనేషియా ఓపెన్ లో మాత్రం చైనా క్రీడాకారుల పై స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగించా.  ఏకంగా ఇద్దరిని ఓడించి వాళ్ళ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశా. చైనా క్రీడాకారులను ఓడించిన ఘనత నాదే. పుల్లెల గోపీచంద్ ఆధ్యర్యంలో నేను ఆడిన కష్టానికి ప్రతిఫలం ఇది.  భవిష్యత్తులో ఇదే తీరును కొనసాగించాలని భావిస్తున్నా.

ఇండోనేషియా టైటిల్ గెలిచిన నేపధ్యంలో ఒలంపిక్స్ లో స్వర్ణం సాధిస్తానని అనుకుంటున్నారా ?

నేను ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చాను. ఈ సారి ఒలంపిక్స్ లో ఖచ్చితంగా స్వర్ణం సాధించి దేశ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నా. అందరి మద్దతు ఉంటే సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రస్తుతం నా ఫామ్, ఫిట్ నెస్ బాగున్నాయి.  సైనా నెహ్వాల్ స్వర్ణం తేవాలని అందరం ఆకాంక్షిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director maruti happy days
Gundamma katha movie completed 50 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles