అలఘు గుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుఁడొకఁడిష్టుఁడై తనున్
వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుఁగా,
తెలిసి కుచేలుఁడొక్క కొణి దెండడుకుల్ దన కిచ్చినన్ మహా
ఫలదుఁడు కృష్ణుఁ డత్యధిక భాగ్యము లాతని కీఁడై భాస్కరా!
టీకా : అలఘు = గొప్పవైన లక్షణాలు ; గుణప్రసిద్ధుడు = మంచి గుణాలతో నిండిన గొప్పవాడు ; నట్టి = అయిన ; ఘనుడు = మహనీయుడు ; ఒకఁడు = ఎవరైనా ఒకడు ; ఇష్టుఁడు + ఐ = కావలసినవాడు ; తమన్ = తనను ; వలచి = కాంక్షించి ; ఒకించుక = కొద్దిగా ; ఏమిడిన = ఏమి పెట్టినా ; వానికిన్ = ఇచ్చినవారికి ; మిక్కిలి = ఎక్కువగా ; ఒక్క కొణిదెండు = ఒక పిడికెడు ; తనకు = శ్రీకృష్ణునికి ; ఇచ్చినన్ = ఈయగా ; మహాఫలదుఁడు = గొప్ప ఫలాలను ఇచ్చువాడు ; భాగ్యములు = సంపదలు ; అతనికిన్ = ఆ కుచేలునికి ; ఈడె = ఇవ్వడం
తాత్పర్యము : పూర్వం కుచేలుడు, శ్రీకృష్ణుని గొప్పతనం తెలుసుకుని అతనికి ఒక పిడికెడు అటుకులు ఇవ్వగా... ఫలప్రదముడైన శ్రీకృష్ణుడు ఆ కుచేలుడికి ఎన్నో మహాసంపదలు బహుమానంగా ఇచ్చాడు. అలాగే తెలిసినవారు ఎవరైనా మోసగిస్తే.. గొప్పగుణాలను కలిగినవాడు అతనిని క్షమించి, ఇంకా ఎక్కువ మేలు చేస్తాడు.
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more
Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more
Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more
Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more
Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more