ysrcp leader botsa satyanarayana controversial statements on chandrababu naidu in his latest press meet

Botsa satyanarayana controversial statements on chandrababu naidu media press meet

botsa satyanarayana, chandrababu naidu, revanth reddy, votuku notu controversy, trs party news, tdp party, ysr congress party

controversial statements on chandrababu naidu media press meet : ysrcp leader botsa satyanarayana controversial statements on chandrababu naidu in his latest press meet.

‘బాబూ.. ఎందుకు భయపడుతున్నావ్?’

Posted: 06/08/2015 01:48 PM IST
Botsa satyanarayana controversial statements on chandrababu naidu media press meet

ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ.. ఎన్నికల్లో ఘోరంగా పరాజయం అయిన తర్వాత కంటికి కనిపించకుండా పోయారు. అప్పుడప్పుడు మెరుపుతీగలా మీడియాలో కనిపించించి ప్రత్యర్థి పార్టీలపై గొంతుచించుకున్నారే తప్ప.. తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఏమాత్రం నోరువిప్పలేదు. అయితే.. కాంగ్రెస్ పార్టీ కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్ వుండదని భావించిన ఈయన.. పార్టీ కండువాను మార్చేశారు. ఈ క్రమంలోనే ఈయన 07-06-2015వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వైకాపాలో చేరిన తర్వాత బొత్స తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో బాబు ఏ విధమైన అక్రమాలకు పాల్పడకుండా వుంటే.. వారం రోజులుగా ఆయన ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. ‘బాబూ.. నీకు భయమెందుకు? నువ్వేమీ తప్పు చేయకుంటే స్వయంగా విచారణకు ఆదేశించు’ అని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం పేరిట బాబు సింగపూర్ చుట్టూ తిరుగుతున్నాయని ఆయన విమర్శించారు.

ఈ క్రమంలోనే ఆయన బాబు మీద మండిపడుతూ.. సింగపూర్ లో బాబుకు వ్యాపారాలున్నాయని, అందుకే ఆ దేశ ప్రభుత్వాన్ని కాకా పడుతూ వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. బాబు మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బొత్స తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : botsa satyanarayana  chandrababu naidu  revanth reddy  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more