ఉప్పుఁ కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడఁజూడ రుచుల జాడ వేఱు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వధాభిరామ వినురమేమ.
కప్పురంబు = కర్పూరము, ఒక్క పోలికన్ = ఒకటే విధముగా, పుణ్య పురుషులు = అద్రుష్టవంతులు
వేమన శతకంలో వేమన ఈ లోకంలోని ఉత్తమ పురుషులను ఈ విధంగా పోల్చాడు. ఉప్పు, కప్పూరము చూడటానికి ఒకే రంగులో ఉన్నా, ఉప్పు రుచి, కర్పూరము రుచి చూడటానికి వేరువేరుగా ఉంటాయి. అలాగే పురుషులు అందరూ ఒకే రకంగా ఉన్నా అందులో ఉత్తమ పురుషులు వేరుగా ఉండును.
ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడె చెఱచు వాని వంశమెల్ల
చెఱకు వెన్ను పుట్టి చెఱుపదా తీపెల్లా
విశ్వధాభిరామ వినురమేమ.
ఉత్తముని = మంచివాని, ఓగు = చెడ్డవాడు, జన్మించిన = పుట్టిన యెడల, చెఱచున్ = పాడుచేయును
వేమన శతకంలో వేమన ఉత్తముని చెరుకు గడతో పోల్చాడు. చెఱుకు గడకు కంకి పుట్టి దాని యొక్క తీపిని ఏవిధంగా నాశనం చేస్తుందో... మంచి వాని కడుపున చెడ్డవాడు పుడితే వానికే కాకుండా ఆ కుల వంశానికి మొత్తానికి చెడ్డ పేరు తీసుకువస్తాడని భావం.
(And get your daily news straight to your inbox)
Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more
Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more
Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more
Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more
Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more