టాలీవుడ్ నటి హేమ ఆంటీ తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే నటుడు బ్రహ్మనందం, హేమ ఆంటీల రొమాన్స్ కామెడీ వెండితెరపై పండిస్తారు కాబట్టి.. హేమ ఆంటీ ని మరిచిపోవటం చాలా కష్టం. అయితే ఇప్పుడు ఆమె కు కష్టాలు వచ్చి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంటే హేమ ఆంటీకి వచ్చిన కష్టం, పోలీసులు వల్లే సాద్యం అవుతుంది కాబట్టి వారి వద్దకు వచ్చి తన గొడు వెల్లబోసుకుంది. అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్ గా హేమ ఆంటీ కి నిద్ర పట్టడం లేదట, అర్థరాత్రి అయితే చాలు.. ఒకటే బూతు మెసేజ్ లు వస్తున్నాయి. అందుకే హేమ ఆంటీకి నిద్రపట్టడం లేదు. ఇదే విషయాన్ని పోలీసులు ముందు చెప్పటం జరిగింది.
రంగంలోకి దిగిన పోలీస్ మామలు.. బూతు మెసేజ్ ల ఓనర్ ఎవరు? ఎక్కడ నుంచి అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నాడో పోలీస్ మామలు తెలుసుకున్నారు. అంటే గత కొద్ది రోజుల నుండి హేమ ఆంటీకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుండి వేళకాని వేళ, అసభ్యకరంగా ఉండే బూతు మెసేజ్ లు ఆమె సెల్ ఫోన్ కి పంపిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన హేమ ఆంటీ పోలీసులను సంప్రదిస్తే..వెంటనే వారు ఈ బూతు మెసేజ్ ల ఓనర్ ను పట్టి హేమ ఆంటీ ముందు నిలబెట్టారు. అదీ కూడా మన మాదాపూర్ పోలీసులు చాకచక్యంగా నిఘా పెట్టి, వాడిని పట్టుకున్నారు. ఇంతకీ అతను ఎవరు అంటారా? సూర్యా పేటలోని ఒక కిరాణా షాపు నడుపుకుంటున్నా మధు. ఈ మధు మద్యరాత్రి వేళలో నటి హేమకి అసభ్యకరమైన మెసేజ్ లు పంపించి.. స్వయం త్రుప్తి పొందుతున్నాడు.
ఇప్పుడు పోలీస్ మామలు బూతు మెసేజ్ ల మధు స్వయం త్రుప్తి వెనక ఉన్న రహస్యాన్ని బయటకు తీసే పనిలో బిజీగా ఉన్నారు. పోలీసుల విచారణ పూర్తయిన తరువాత సైబర్ క్రిమినల్ యాక్టు ప్రకారం కేసు నమెదు చేస్తామని పోలీసులు అంటున్నారు. అయితే దీనిపై నటి హేమ మాట్లాడుతూ.. నా పర్సనల్ నెంబర్ ఎలా తెలుసుకున్నాడు నాకైతే తెలియదు. నా దగ్గర ఒక్కటే ఫోన్ నెంబర్ ఉందని చెబుతుంది. అయితే నా నెంబర్ మూవీ ప్రోడ్యసర్ దగ్గరి నుండి తీసుకొని ఉంటాడని హేమ ఆంటీ తెలిపారు.
అయితే నేను ఈ విషయన్ని ముందుగా నా కుటుంబ సభ్యులతో సంప్రదించిన తరువాతనే పోలీసులకు చెప్పటం జరిగిందని చెబుతుంది. అంతేకాకుండా ఇలాంటి వేధింపులు నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది మహిళలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. అయితే వారు బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారని హేమ ఆంటీ తెలిపారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కొన్ని మహిళ సంఘాలు హేమ ఆంటీకి మద్దతు తెలుపుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more