We stop telangana cm kiran

Kiran, Andhrapradesh cm, Sonia Gandhi, Seema andhra, telangana,

We will stop Telangana formation says cm kiran kumar reddy at Srikakulam.

తుఫాన్ని ఆపలేక పోయా... తెలంగాణను ఆపేస్తా ?

Posted: 10/20/2013 03:26 PM IST
We stop telangana cm kiran

తెలంగాణ రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఓ పక్క వడివడిగా అడుగులు వేస్తుంటే... మరో ప్రక్క కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని పదే పదే చెబుతున్నారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అందరి చేత సమ్మెను విరమింపజేసి, అప్పుడప్పుడు ఢిల్లీ వెళుతూ రాష్ట్ర విభజనకు అడ్డుగా ఉన్న వాటన్నింటికి తొలగిస్తూ మార్గాన్ని సుగమమం చేస్తూనే, ఇక్కడ సమైక్యవాదినే అంటూ డబ్బా కొట్టుకుంటున్న కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మరో సారి రాష్ట్ర విభజను ఎలాగైనా అడ్డుకుంటామని అన్నారు.

గత వారం శ్రీకాకుళం జిల్లాలో ఫైలిన్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన ‘పైలీన్ తుపాన్ మాత్రం ఆపలేక పోయాం.. కాని రాష్ట్ర విభజన అనే తుపాన్ మాత్రం కచ్చితంగా ఆపగలం అని స్పష్టం చేశారు. దీనికి ప్రజల సహకారం కావాలని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. విభజన ప్రక్రియ ఇంత దూరం వచ్చాక కిరణ్ ఎలా ఆపగలడని మాట్లాడుతున్నాడు అంటే.... తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓడిస్తే సరిపోతుందనేది కిరణ్ వాదన. కానీ సీడబ్ల్యూసీ నిర్ణయం వెల్లడించిన రోజే అసెంబ్లీలో బిల్లు పాసవ్వనక్కర్లేదని స్పష్టం చేసింది. ఈయన మాత్రం గతంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాల ఏర్పటుకు సంబంధించి అసెంబ్లీ తీర్మానమే కీలకం అయ్యింది.

కానీ ఇక్కడ కేంద్రం అసెంబ్లీ ఆమోదం అక్కర్లేదని, కేవలం చర్చ మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చేస్తున్న కిరణ్ కి కేంద్రం అంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం హాస్యస్పదమే అవుతుంది. ఇక ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు అధిష్టానం మాటను ఎదిరించలేక తలోగ్గి వారి దారిలోకి వెళుతున్నారు. కొంత మంది కేంద్ర మంత్రలు విభజన చేస్తే తప్పేంటి అని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కిరణ్ రాష్ట్ర విభజనను ఆపుతాం... ఆపుతాం... అని పదే పదే చెప్పడం చూస్తుంటే ఆయన సీటుకు ఎసరు రాకుండా ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడనిపిస్తుంది. చూద్దాం కిరణ్ లో ఏ మాత్రం  ఆపే సత్తా ఉందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more