సమైక్యాంద్ర పై సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు కాకి రాగం పాడుతున్నారు. మరికొంత మంది మాత్రం కోయిల రాగం పాడుతూ.. కాలం గడుపుతున్నారు. రాష్ట్ర విభజన జరుగుతుందని కేంద్ర మంత్రులు కొంత మంది ఫై-లిన్ తుపాన్ సాక్షిగా సమైక్యవాదులను మార్చే పనిలో బిజీగా ఉన్నారు. కానీ బెజవాడ సార్ మాత్రం విభజనపై ముందడుగు వేయటం సాధ్యం కాదని గట్టిగా చెబుతున్నారు.. సారీ జ్యోసం చెబుతున్నారు. కాకి అరుపులో..కోయిల రాగం సీమాంద్ర ప్రజలకు వినబడినప్పటికి .. అది నిజమైన కోయిల రాగమేనా అనే అనుమానం సమైక్యవాదుల వస్తుంది. అయితే ఆయన మాత్రం బలంగా చెబుతున్నారు. రాజ్యాంగంలోని 371-డి అధికరణను సవరించకుండా విభజనపై ముందడుగు వేయడం సాధ్యంకాదని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున నిర్ణయాలు మారే అవకాశముందని లగడపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తమ పార్టీ పెద్దలు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. 371-డి అంశాన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదికలోను ప్రస్తావించారని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ కమిటీ స్పష్టంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు.
రాజీనామాలపై ఒత్తిడి తెస్తే ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో ఖచ్చితంగా వెనక్కు తగ్గుతుందని చెప్పారు. 2014లో జరిగే ఎన్నికల వరకు ఎంపీల అవసరం పార్టీకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. బతికున్నవారికి సమాధులు కట్టడం సంస్కృతికాదని చెప్పారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలను తాను పరిగణనలోకి తీసుకోనని, ఆస్థుల విషయంలో తాను తెరిచిన పుస్తకమని చెప్పుకొస్తూ, ఏ వేదికపైనైనా చర్చించడానికి సిద్ధమన్నారు.
అయిన లగడపాటి సమైక్యరాగం పాడినంత మాత్రన వినివారు ఎవరు ఉన్నారు. ఆయనకు సొంత ఊరులోనే.. సమైక్య సెగ తగిలిన విషయం తెలిసిందే. ఏదో ప్రతి రోజు మీడియా ముందు కనిపించాలి కాబట్టి.. ఎవరికి ఉపయోగం లేని, ఎప్పటి జరగని నాలుగు మాటలు.. ఎనిమిది మంది పై విమర్శలు చేస్తే.. చాలు.. రెండు రోజుల వరకు మీడియాలో, న్యూస్ పేపర్లల్లో ఆయన గురించి, ఆయన ఫోటో వస్తుంది. అంతే తప్ప.. ఆయన నిజంగా సమైక్యాంద్ర కోసం రాజీనామా చేసి ఉంటే., ఆ రాజీనామాను ఆమోదింపజేసుకోవటానికి రెండు నెలల సమయం పట్టింది. అంటే ఆయన సమైక్య రాగం ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతుంది.
సమైక్యాంద్ర కోసమే రాజీనామా చేసిన టిడిపి రాజ్యసభ సభ్యుడు ..నందమూరి హరిక్రిష్ణ రాజీనామాను.. కొన్ని గంటల్లోనే ఆమోదించటం జరిగింది. అంటే రాజ్యసభలో వేగం జరిగింది. కానీ పార్లమెంట్లో మాత్రం రెండు నెలల సమయం తీసుకున్నప్పటికి లగడపాటి రాజీనామా కథ అలాగే మిగిలిపోయింది. చిత్తశుద్ది అనేది ఉంటే.. చిన్న చీమైన.. బలవంతమైన సర్పమునుకూడా చంపగలదు అనే విషయం అందరికి తెలుసు. అయిన అమ్మ అజ్నా లేకుండా సమైక్యాంద్ర కోసం లగడపాటి ఏం చేయగలడు చెప్పండి. ఇదంతా మన ఖర్మ అనుకోని.. ముందుకు పోవటమే చెయ్యాలి. అయిన ఇలాంటి నాయకుల్ని సీమాంద్ర ప్రజలు ఇంక ఎన్నిరోజులు భరించాలో..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more