ఇప్పుడు రాష్ట్రాన్ని భయపడతున్న తుపానే.. ఫై-లిన్. బంగాళాఖాతంలో కేంద్రీక్రుతమై ఉన్న పెనుతుపానును ఫై- లిన్ అని పిలవాలి. ఇది ధాయ్ భాషా పథం . దీనికి ‘ ఇంద్రనీలం ’ అని అర్థం, అదొక మేలిమి రత్నం పేరు . ఇప్పుడు తుపానుకు పేరు పెట్టే అవకాశం థాయ్ లాండ్ ప్రభుత్వానికి రావడంతో వారు ఈ పదం సూచించారు. ఇంతకుముందు వచ్చిన తుపాను శ్రీలంక ప్రభుత్వం ‘మహాసేన్ ’ అనే పేరు పెట్టింది. అసలు తుపానుకి ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు. తుపాన్లు వచ్చినప్పుడు వాటిని నిర్థిష్ఠ పేరు లేకపోతే ప్రజలను ముందుగా అప్రమత్తం చేయడం కష్టమవుతుంది. ప్రసార మద్యామాల ద్వారా ప్రచారం చేయడానికి ప్రతి తుపానుకే ఏదో ఒక పేరు ఉండాలని ప్రపంచవ్యప్తంగా అందరూ ఆమోదించారు. 1900 కు ముందు దక్షిణార్థ గోళంలో ఏర్పాడే తుపాన్లకు పురుషుల పేర్లనే పెట్టేవారు. 1953 క నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పాడే తుపాన్లకకు హరికేన్ కేంద్రం ఇచ్చిన పేర్లనే వాడేవారు.
ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో తుపాన్లకు ప్రపంచ వాతావరణ సంస్థ ఇచ్చే పేర్లను ఫెడుతున్నారు. ఇక భారత దేశం చుట్టూ ఉన్న అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో ఏర్పాడే తుపాన్లకు పేర్లు పెట్టాలని ఈ సముద్రాల చుట్టూ ఉన్న 8 దేశాలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఇందుకోసం తొలుత 2000 సంవత్సరంలో ఒమన్ లో ఈ దేశాలు సమావేశమయ్యాయి. అనేక చర్చల ఆనంతరం 2004 నుంచి పేర్లను ప్రారంభించారు. ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఈ 8 దేశాలు వరుసగా బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్నార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్లాండ్ . మొట్టమొదట సారిగా బంగ్లాదేశ్ పెట్టిన పేరు ‘ఒనిల్ ‘ కాగా, భారత్ ‘అగ్ని ’ అనే పేరు ఇచ్చింది. ఇప్పటికి మొత్తం 23 తుపాన్ల పేర్లు పూర్తయ్యాయి. ఇప్పుడు తీర్మాన్ని సమీపిస్తూన్న ఫై-లిన్ 24వది, అంటే ఇప్పటి వరకు ఒక్కోదేశం మూడుసార్లు పేర్లు పెట్టింది. తొలుతే అన్నీ దేశాలు మొత్తం 64 పేర్లను ఇచ్చాయి. ఇంకా 40పేర్లు సిద్దంగా ఉన్నాయి. అంటే మరో 40 తుపాన్లు వచ్చిన తరువాత ఈ 8 దేశాలు కొత్త పేర్ల జాబితాను మళ్లీ సిద్దం చేస్తాయి
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more