వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 16 నెలల తరువాత విడుదల అయి, స్వేచ్చా వాయులు పీల్చుకుంటున్నాడు. వేల కోట్లు దోచుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈయనకు ఇంత తొందరగా బెయిల్ ఎలా వచ్చింది ? ఇన్ని రోజులు దర్యాప్తు పూర్తి కాలేదు... ఇంకొన్నాళ్లు పడుతుంది... జగన్ కి బెయిల్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని ప్రతి సారీ చెప్పుకొచ్చిన సీబీఐ ఉన్నట్లు ఉండి దర్యాప్తు ముగిసింది, క్విడ్- ప్రొ-కో (నీకు ఇది నాకు అది) ఏమీ జరగలేదని తేల్చేడం ఆ తరువాత సీబీఐ కోర్టు బెయిల్ ఇవ్వడం చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద డీల్ కుదిరే ఉంటుందని, ఇదంతా ప్రక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రక్క వారు ఒప్పందం కుదిరిందని నెత్తి నోరు కొట్టుకుంటూ చెబుతున్నా.... వారి వాదలను బలపడే విధంగా అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కూడా డీల్ కుదిరింది అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ఇంత కాలం సమైక్య రాష్ట్రం మీద ఆశతో పోరాడుతున్న సీమాంధ్ర నాయకులు కూడా జగన్ కి బెయిల్ రావడం జీర్ణించుకోలేక పోతున్నారు. వారు సమైక్య రాష్ట్రం పై ఆశలు వదులుకొని ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం జగన్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే బెయిల్ ఇచ్చారని వారు అంటున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆశలు వదిలేసుకొని జగన్ పార్టీనే నమ్ముకుందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదని భావించే జగన్ కి బెయిల్ ఇచ్చిందని వారు అంటున్నారు. అయితే ఇదంతా తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమనం చేసుకోవడానికే అంటున్నారు.
తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. తెలంగాణ అంశం పై ప్రకటన రాకముందే తన పదవులకు రాజీనామా చేసిన వైకాపా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు వాటిని ఆమోదించుకోవడానికి రెడీ అవుతున్నారు. జగన్ కి బెయిల్ రావడం, అధిష్టానంతో ఒప్పందం కుదరడం తో ఇన్ని రోజులు గమ్ముగా ఉన్న వైకాపా నేతలు నేడు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలవనున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమోదించాల్సిందిగా ఒత్తిడి చేయనున్నారు. ఇందతా జగన్ సూచనల మేరకే జరుగుతుంది. అంటే ఇక్కడ అంతా నడిపించేది జగనే అయినా దీని వెనక డైరెక్షన్ చేసేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానమే. కాంగ్రెస్ అధిష్ఠానంనుంచి అందిన తగిన ఆదేశాల మేరకే... వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్‌ను కలుస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, రాష్ట్ర విభజన విషయంలో కీలకపాత్ర పోషిస్తున్న దిగ్విజయ్ సింగ్ పంపిన సంకేతాల మేరకే వైసీపీ ఎమ్మెల్యేలు కదిలినట్లు తెలిసింది. ఇదంతా తెలంగాణపై అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టేబోయే తీర్మానం గట్టెక్కేందుకు, రాష్ట్ర విభజనపై ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు ముందుకే అని కాంగ్రెస్ అధిష్ఠానం నిరూపించుకునేందుకు... రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే తీర్మానం వీగిపోకుండా జాగ్రత్త పడుతోంది. వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 17 మంది. వారి రాజీనామాను ఆమోదింప జేస్తే అసెంబ్లీలో సంఖ్యాబలం తగ్గుతుంది. ఇప్పటికే సీమాంధ్రలో 15 ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీరి రాజీనామాలు ఆమోదిస్తే 34 కు చేరుతాయి. సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యే మధ్య వ్యత్యాసం 13 మాత్రమే ఉంటుంది. వీరిలో ఇంకొంత మందిని తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించేలా చేస్తే సరిపోతుందని ఉద్దేశ్యంతో వైకాపాతో ఒప్పందం కుదుర్చుకుకే బెయిల్ ఇచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more