ఆంటోనీ కమిటి రిపోర్ట్ తెలంగాణ విభజన కు అడ్డుపడింది. దీనిపై ఈ నెల 25 వరకు ఆంటోని కమిటి రిపోర్ట్ పై ఉన్న అనుమానాలు తొలిగిపోతే.. అప్పుడు తెలంగాణ విభజన నోట్ కు దారి దొరుకుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణా అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దూకుడుగా వెళ్ళాలనుకున్నా చిక్కుముడిలా పెనవేసుకుపోయిన విభజన సమస్య ఎంతకీ ముందుకు సాగడం లేదు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల అభ్యంతరాల పరిశీలనకు రక్షణ మంత్రి ఆంటోనీ చైర్మన్ గా ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీకు కూడా ఇంకా విభజనపై ఒక అభిప్రాయానికి రాలేకపోతుంది. జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీకిలో ఆంటోనీ తన నివేదికను సమర్పిస్తారని అందరూ అనుకున్నా కాని అది సాధ్యపడలేదు. దీంతో తెలంగాణపై కదలిక రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రధాని ఇంట్లో జరిగిన కోర్ కమిటీలో అంటోనీ కమిటీ.. వర్కింగ్ కమిటీ తీర్మానం తరువాత ఇప్పటి వరకు ఇరుప్రాంతాల నేతలు తమను కలుస్తూనే ఉన్నారని, పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపింది. అయితే అందరూ సమస్యలు చెప్పడం తప్ప ఎవరూ పరిష్కార మార్గాలు చెప్పడం లేదని.. అందుకే తమకు నివేదిక ఇవ్వడానికి మరింత సమయం కావాలని ఆంటోని అంటున్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటుపై వెనకడుగు వేయకూడదని కచ్చితమైన నిర్ణయంతో ఉన్న కాంగ్రెసు అధిష్టానం సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలను పరిష్కరించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అందుకే ఎక్కువ మందిని సంతృప్తిపరిచే విధంగా ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలని, మరో వారంలో నివేదికను సమర్పించాలని ఆంటోనీకి సోనియా సూచించినట్లు తెలిసింది. ఈనెల 25వ తేదీన ప్రధాని అమెరికా టూర్ వెళ్తున్నారు. ఈలోగా నోట్ ను మంత్రివర్గం ముందుకు పంపాలని సోనియా భావిస్తున్న నేపథ్యం 19న జరిగే కేబినెట్ సమావేశంలో విభజన నోట్ ఆమోదానికి రావచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఈ నెల 25 వరకు ఆంటోనీ కమిటి రిపోర్టు ఇవ్వలేకపోతే మాత్రం తెలంగాణ విభజన నోట్ మరింత ఆలస్యం అవుతుందని తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే తెలంగాణ నేతలు ఆంటోని కమిటి ముందు వివరించిన విషయం ఎలాంటి నిజం లేదని ఆంటోనీ చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే సీమాంద్ర నేతలు మాత్రం హైదరాబాద్ ను ప్రధాన సమస్యగా చూపిస్తున్నారు. అంతేకాకుండా అనేకమంది రాష్ట్ర విడిపోయినప్పటికి హైదరాబాద్ ను ఇద్దరికి ఉపయోగపడేలా ఉండాలని చెబుతున్నారు. అయితే హైదరాబాద్ విషయం ఇరుప్రాంతాల నేతలు గట్టి వాదానలు వినిపిస్తున్నారు. కానీ దానికి పరిష్కారం మాత్రం ఎలా అన్నది ఎవరు చెప్పటం లేదని ఆంటోనీ కమిటి సభ్యులు సోనియా గాందీ, మన్మోహన్ సింగ్ కు వివరించారు. ఈనెల ఆఖరిలోపు .. తెలంగాణ విభజన పై ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉందని ఆంటోని కమిటి సోనియా గాంధీ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more