వైరల్ ఫివర్ వల్ల ఓటు దూరమైనప్పటికి.. సోనియా గాంధీ విజయం సాధించారు. లోక్ సభలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగా .. సోనియాగాంధీకి ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆమె ఎయిమ్స్ లో చేరారు. ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. అయితే విపక్షాలు సూచించిన సవరణలపై ఓటింగ్ జరుగుతుండగానే కేంద్రమంత్రి సెల్జా, రాహుల్ గాంధీలు సోనియాను సరాసరి ఎయిమ్స్ కు తీసుకువెళ్లారు. ఈవిషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కొంచెం విషాదంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక , తన భర్త వాద్రాతో కలిసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే సోనియా గాంధీ కల నెరవేరింది... కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీయే చైర్‌పర్సన్ సోనియాగాంధీ మానసపుత్రిక ఆహార భద్రత బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
అప్పుడా.. ఇప్పుడా అంటూ ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన బిల్లు లోక్‌సభలో పాదం మోపింది. కేంద్ర ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి కేఏ థామస్ బిల్లును ప్రవేశపెట్టారు. 9గంటల సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అయితే బిల్లు ఆమోదం పొందే సమయంలో సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా సభలో లేకపోవడం కొసమెరుపు.. విషాదం... ఆహార భద్రత బిల్లుకు ముహూర్త బలం బాగా కలిసొచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజాకర్షణ దండిగా ఉన్న బిల్లును వ్యతిరేకించేందుకు ఏ పార్టీ కూడా సాహసం చేయలేకపోయింది. అందుకే చర్చ సందర్భంగా ఘాటైన విమర్శలు గుప్పించిన ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, యూపీయేకి బయటనుంచి మద్దతిస్తున్న ములాయం పార్టీ ఎస్పీ సహా అన్ని పార్టీలు చివరాఖరకు మద్దతునిచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ కీలకపాత్రను పోషించారు. అన్ని పార్టీలను ఒప్పించడంలో ఆయన పడిన కష్టం ఫలించింది.. బిల్లు ఓకే అయింది...
ఆహారం అందరి హక్కు
కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందేశం ఇవ్వడానికి ఇదే అనువైన సమయం. ఆకలి, పౌష్టికాహార లోపాన్ని దేశం నుంచి పూర్తిగా తుడిచిపెట్టడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా చెపుతున్నా' అని సోనియా వ్యాఖ్యానించారు. కోట్లాది ప్రజల ఆకలిని తీర్చే ఇంతటి ప్రతిష్టాత్మక, చారిత్రాత్మక పథకానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా, సులువుగా సభ ఆమోదం పొందేలా సహకరించాలని సూచించారు. పథకం అమలుకు సరిపడా వనరులున్నాయా? లేదా? అన్నది పెద్ద సమస్య కాదని, ఇది రైతులకు లాభం చేకూరుస్తుందా? లేదా? అన్నది చూడాలన్నారు. పథకానికి సరిపడా వనరులు సమకూరుస్తామని, చేసి చూపిస్తామని సోనియా ధీమాగా చెప్పారు. వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాలు కాపాడడానికి యూపీఏ కట్టుబడివుందని ఆమె పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను అంగీక రిస్తూనే ఈ విధానంలో అక్రమాలను అరికట్టా ల్సిన ఆవశ్యకతను సోనియా నొక్కి చెప్పారు. లబ్ధి దారులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో దేశ ప్రజలందరికి ఆహార భద్రత కల్పిస్తామని చెప్పామని, అందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సోనియా చెప్పారు. వివిధ హక్కుల కల్పనకు యూపీఏ వాగ్దానం చేసినట్టుగానే ఇప్పటికే సమాచార హక్కు, విద్యా హక్కు, ఉపాధి హామీ, అటవీ ఉత్పత్తులపై హక్కులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని సోనియా గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more