ఏళ్ల నాటి నుండి నలుగుతున్న ప్రత్యేక తెలంగాణ అంశంపై కీలక నిర్ణయం దిశగా కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసిన ఆ పార్టీ హైకమాండ్ ఊహించని విధంగా ఒకే రోజు రెండు కీలక భేటీలకు తెరలేపింది. ఈ నెల 31న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం, ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ ఏర్పాటు చేయనున్నారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ అంతకన్నా ఒక రోజు ముందు ఈ రోజు రెండు సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాయంత్రం నాలుగు గంటలకు యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, ఐదున్నర గంటలకు సీడబ్ల్యూసీ భేటీ జరపనున్నారు. ఈ మేరకు సభ్యులందరికి కూడా పార్టీ తరపున వర్తమానం అందింది. ఆంధ్రప్రదేశ్ విభజన దిశగా ఇప్పటికే సూత్రప్రాయంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా అందుకు ఒప్పించే దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నిర్ణయానికి మిత్రుల ఆమోద ముద్ర వేయించుకుని విభజన ప్రక్రియపై ముందుకు వెళ్లనున్నారు. సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ పరంగా అధికారిక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ తర్వాత తలెత్తే పరిణామాలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
రెండు భేటీల తర్వాత తెలంగాణ అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఈ రోజు వెల్లడించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశాల ఎజెండాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన అంశానికి సంబధించి మూడు ప్రతిపాదనలను కాంగ్రెస్ యూపీఏ భాగస్వామ్య పక్షాల ముందు పెట్టనుంది. వాటిలో రాయల తెలంగాణ మొదటిది కాగా, హైదరాబాద్ రాజధానిగా 10జిల్లాలతో కూడిన తెలంగాణ రెండో ప్రతిపాదన. ఇక ప్రత్యేక కాల పరిమితితో హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలన్నది కాంగ్రెస్ మూడో ప్రతిపాదనగా ఉండనుందని ఆ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో తెలంగాణ ప్రకటిస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక డిమాండ్లు ఊపందుకునే అవకాశాలున్న నేపథ్యంలో వాటిని అధిగమించే వ్యూహాన్ని కూడా కాంగ్రెస్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇది కూడా యూపీఏ సమన్వయ కమిటీలో చర్చకు రానుంది. మరోవైపు సీడబ్ల్యూసీ ఎజెండాపై ఆ పార్టీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ, 2001 తీర్మానం ప్రకారం రెండో ఎస్సార్సీకే ఇప్పటికీ కట్టుబడుతూ వస్తోంది. అయితే దాని స్థానంలో చేసే తీర్మానంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని మాత్రమే పొందుపరచాలని నిర్ణయించినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more