Tdp mlas sensational comments on ysr and kcr

ys rajasekhara reddy, k chandrasekara rao, trs party, congress party, tdp, tdp mlas, errabelli dayakara rao, kcr family, ktr, telangana issue,telangana state, ysr to kcr, chalo assembly, breaking news, ap politics, political news, andhra news, assets,

tdp mlas sensational comments on ysr and kcr

అసలు వసూల్ రాజాలు వీరే?

Posted: 06/21/2013 11:45 AM IST
Tdp mlas sensational comments on ysr and kcr

రాష్ట్రంలో ఉన్న అసలు వసూల్ రాజాల పేర్లను బయటపెట్టారు. అప్పుడు ఆయన చేశారు.. ఇప్పుడు ఈయన చేస్తున్నారని ఆయన అన్నారు. దివంగత వైఎస్‌ఆర్‌ మార్కు అవినీతి కార్యకలాపాలను రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం విరుచుకుపడింది. ఆ పార్టీ గన్‌పార్క్‌లో భూ ఆక్రమణలకు, సెటిల్‌మెంట్లకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించింది. మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సండ్ర వెంకట వీరయ్య తదితరులు మాట్లాడారు. అనేక మంది పారిశ్రామిక వేత్తలను దోచుకున్న ఘరానా దొంగ కేసీఆర్‌ అని తీవ్రంగా విమర్శించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ రౌడీ మూకలు హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు చేసేవి. ఇప్పుడా పనిని ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్‌ఎస్‌ చేస్తోంది. నగరంలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఒక విద్యా సంస్థ, ఆస్పత్రిని నిర్మించాలన్నా టీఆర్‌ఎస్‌ వారికి ముడుపులు చెల్లించాల్సిందేనని చెప్పారు. తొలుత వారికి వ్యతిరేకంగా ఒక ప్రకటన జారీ చేస్తారు. ఏదో విధంగా వారిని కాళ్ల బేరానికి తీసుకువస్తారు. తెలంగాణ భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని అందినంతా దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

చివరకు ఏ సినిమా ఏ థియేటర్లో ఎన్ని రోజులు ఆడాలో కూడా టీఆర్‌ఎస్‌ వారే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని పక్కకుబెట్టి ఆ పార్టీ ఆర్థిక అరాచకాలకు పాల్పడుతోందన్నారు. ఉద్యమాలా? వసూళ్లా? వేటిని ఆచరిస్తారో టీఆర్‌ఎస్‌ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై తొలుత చేసిన ప్రకటన ఏమిటి? ఒకటి రెండు రోజుల్లోనే దానిని గాలికి వదలడం వెనక మతలబు ఆ పార్టీనే తెలపాలన్నారు. కేసీఆర్‌, అతని కుటుంబ సభ్యులను నమ్మరాదని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌పై వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పలేక తెలంగాణ వాదులపై ప్రతిదాడికి ఆ పార్టీ పాల్పడుతోందన్నారు. తెలంగాణ రావడం కేసీఆర్‌కు అస్సలు ఇష్టం లేదు. ఆయనకు కావల్సింది కేవలం డబ్బులేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే సమయంలో సకల జనుల సమ్మెను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దని దుయ్యబట్టారు. తాను పోగేసిన అక్రమ సంపాదనను నెల్లూరుకు చెందిన బడా బిల్డర్‌ సుబ్బారెడ్డి దగ్గర దాయడం అబద్దమా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం కేసీఆర్‌ను విశ్వసించడం లేదన్నారు. తమ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more