నందమూరి' అభిమానులందరూ , ఇవాళ పండుగ గా జరుపుకునే రోజు . తమ అభిమాన హీరో , 'అన్న' గారి పోలికలు తన ముఖం లో , నటనలో మునికి పుచ్చుకుని , మాస్ , క్లాస్ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుని , 13 ఏళ్ళ సినిమా కారియర్ లో ఎన్నో విజయాలు , కొన్ని అపజయాలు చవి చూసి , ప్రతీ సారి , చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగిపోతున్న నటుడు , తాతకు తగ్గ మనవడు అని నిస్సందేహంగా నిరూపించిన యంగ్ టైగర్ యన్ . టీ . ఆర్ . పుట్టిన రోజు ఈ రోజు . ఈ సంవత్సరం ఈ యువ హీరో 30 వ ఏట అడుగుపెడుతున్నాడు .
'నిన్ను చూడాలని ' చిత్రం తో , బాల నటుడిగా 'రామాయణం ' లో రాముడి గా , విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే , చిన్న పిల్లవాడి రూపం లో వచ్చారా అన్న చందంగా నటించిన యన్ . టీ . ఆర్. హీరో గా తెలుగు సినీ రంగం లో తన ప్రస్తానం ప్రారంభించి , 13 ఏళ్ళు గడిచిపోయింది . ఈ సమయం లో 21 సినిమాల్లో నటించారు ఈ హీరో . ఇందులో , 'ఆది' , 'సింహాద్రి ' , 'యమదొంగ ' , ' బృందావనం', 'అదుర్స్ ' ఈ సంవత్సరం విడుదల అయ్యి ఘన విజయం సాధించిన 'బాద్షా' వంటి సినిమాలు ఉన్నాయి , ఫ్లాపులు గా మిగిలిన 'ఆంద్రా వాల ' , అంతంత మాత్రం గా ఆడిన 'ఊసరవెల్లి ' , 'దమ్ము' వంటి చిత్రాలు కూడా ఉన్నాయి .
హిట్లు - ఫ్లాపులతో సంబంధం లేకుండా , ఈ హీరోకి ఎన్నటికీ తరగని చెరగని ప్రేక్షక ఆదరణ ఉంది ... ఇదే తన బలంగా , వరుస సినిమాల తో ముందుకు దూసుకుపోతున్నాడు , యన్ . టీ . ఆర్. ఇప్పటికే , 'బాద్షా' తో ఈ సంవత్సరం హిట్ కొట్టిన ఈ హీరో , హరీష్ శంకర్ దర్శకత్వం లో 'రామయ్య వస్తావయ్య' లో నటిస్తున్నాడు . ఈ రోజు ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు . ఇక 'నందమూరి ' అభిమానులని అమితంగా ఆకట్టుకుని , ఈ చిత్రం మీద కూడా భారీ అంచనాలు పెంచేలా చేసింది ఈ టీజర్ . తన అన్ని చిత్రాల్లో లాగే , ఈ చిత్రం లో కూడా యన్ . టీ . ఆర్ . మార్కు నటన , డైలాగులు , ప్రేక్షకులకు కావలసినంతగా ఉంది అని చెప్పకనే చెబుతోంది ఈ సినిమా టీజార్ ద్వారా . ఇక నేఁ , ఈ చిత్రం కూడా హిట్ గా నిలిస్తే , 2013 ఈ హీరోకి మరువలేని సంవత్సరం గా నిలిచిపోతుంది .
ఇటు హీరోగానే కాక , ఇటు తన తాత ప్రారంభించిన 'తెలుగుదేశం ' పార్టీ ప్రచార కర్తగా , పార్టీ లో ముఖ్య సభ్యుడిగా , యన్ . టీ . ఆర్. అడుగులు ముందుకు వేస్తున్నారు .
కేవలం నటన , ఆహార్యంలోనే కాక , ఒంట్లో ఉన్నావి ఎముకలా , స్ప్రింగులా అనిపించేంతగా ఉండే ఈ నటుడి డ్యాన్స్ , అన్ని వర్గాల వారినీ ఆకట్టుకోవడమే కాక 'నందమూరి' నట వారసత్వాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళేవిధంగా ఉంటుంది , యంగ్ టైగర్ డ్యాన్స్ .
2013 ఈ నటుడికి విజయ సంవత్సరం కావాలని , మరింత పేరు ప్రతిష్టలతో ఈ నటుడు తెలుగు సినీ వినీలాకాసం లో ఒక 'ఆణిముత్యం ' గా వెలగాలని ఆకాంక్షిస్తోంది తెలుగువిశేష్ ...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more