దిల్లీ అబ్ దూర్ నహీఁ అనేవారు. ఇప్పుడు దిల్లీ అబ్ సేఫ్ నహీఁ అనాల్సివస్తోంది.
అత్యాచారాలే కాదు, సామూహిక అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది భారత రాజధాని ఢిల్లీ. కరుడుగట్టిన అమానుషత్వం రెక్కలు విప్పి రాజధాని మీద చక్కెర్లు కొడుతోంది. అది కూడా దక్షిణ ఢిల్లీ మీద డేగ కన్ను వేసి.
ఢిల్లీ దక్షిణ ఢిల్లీ ప్రాంతమైన కోట్లా ముబారక్ పూర్ నుంచి నిన్న రాత్రి 20 సంవత్సరాల నేపాలీ యువతిని ఎత్తుకెళ్ళిన ముగ్గురు యువకులు ఆమె మీద సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి ఆమెను దక్షిణ ఢిల్లీ నానక్ పూర్ ఫ్లై ఓవర్ దగ్గర పడేసి పోయారు.
అర్ధనగ్నంగా స్పృహకూడా పూర్తిగా లేకుండా ఉన్న ఆ యువతిని కనుగొన్న పోలీసులు ఆమెను సఫ్దర్ జంగ్ హాస్పిటల్ కి తరలించారు.
ఢిల్లీ వాసులకు ముఖ్యంగా యువతకు మానసికవైద్యం అవసరమని అనిపిస్తోంది. అత్యాచారమే అపరాధమైతే దాన్ని స్నేహితులతో కలిసి పంచుకోవటం, అబలల మీద వాళ్ళ ప్రతాపం చూపించటం, వాళ్ళు బాధపడుతుంటే ఆనందించటం, ఇవన్నీ మానసిక రుగ్మత లక్షణాలే. ఎడాపెడా సంపాదించి పిల్లలు సంపాదించకుండానే విచ్చలవిడిగా ఖర్చుపెట్టటానికి దోహదం చేస్తున్న వాళ్ళ పెద్దలది కూడా తప్పే.
వీళ్ళూ వాళ్ళని లేదు, ఏ వయసువారు, వివాహితులా అవివాహితులా, స్థలం, సమయం, సందర్భం, ఇలాంటి పట్టింపులేమీ లేకుండా పర్యవసానాన్ని కూడా ఆలోచించకుండా, ఎప్పుడైనై ఎక్కడైనా ఎవరితో కలిసైనా మహిళలమీద అత్యాచారాలను చేసే యువత నిజంగా దేశ సమస్యగానే మారుతోంది.
నిన్ననే మరో సంఘటనలో పదవ తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ అమ్మాయి చుట్టుపక్కల నివసించే వాళ్ళే ముగ్గురు ఆమెను బలవంతంగా తీసుకెళ్ళి కారులో అత్యాచారం చేసి కారులోంచి కిందికి తోసేసారు. ఆ ముగ్గురిలో ఆ అమ్మాయి కజిన్ కూడా ఉన్నాడు.
అంటే, యువత మానసిక స్థాయి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవటానికి మానసిక శాస్త్రం చదవాల్సిన అవసరం లేదు. కానీ వారిని బాగు చెయ్యటానికి మాత్రం మానసికవైద్యుల అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ప్రభుత్వమే ఒక పథకంలా తీసుకుని సంస్కరణ కార్యక్రమాన్ని చేపట్టటం చాలా అవసరం. ఎయిడ్స్, మలేరియాల గురించి అవగాహనను కలుగజేసినట్లుగానే అత్యాచారాలు చేసే మానసిక రోగాన్ని మట్టుబెట్టటానికి కూడా ప్రభుత్వం సమాజ శ్రేయస్సు కోసం ఒక పథకాన్ని రచించి ప్రచారం చెయ్యటం తక్షణ కర్తవ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు- రాజకీయపు ఎత్తులు పై ఎత్తుల మధ్య సమయం దొరికితే
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more