పాకిస్తాన్ లో హింసాకాండలు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్న నాయకులు ఏ పార్టీ వారైనా కానీ, గురయ్యేది ఉగ్రవాద అతివాదులకే. ఈ భయం మాత్రం పార్టీలకు అతీతంగా అందరిలోనూ సమానంగా ఉంది.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, అవామీ నేషనల్ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్ క్యు ఎమ్ లకు పాకిస్తాన్ తాలిబాన్లు హెచ్చరికలు జారీ చెయ్యనే చేసారు.
ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల ప్రచారంలో గన్ షాట్ తో బేనజీర్ భుట్టోని చంపిన ఉదంతం ఇంకా అందరి మనసుల్లోనూ తాజాగానే ఉంది. అయితే ఆమె మరణం పిపిపి పార్టీకి అత్యంత మెజారిటీని తెచ్చిపెట్టింది. సింపతీ కెరటాలు పార్టీకి పనికి వచ్చాయి కానీ ఆమె ఆ ఫలాలను అందుకోలేకపోయారు. ఇదే భయం అన్ని పార్టీలనూ పట్టుకుంది. పోతే పార్టీ బలపడుతుంది సరే కానీ పోవాలని ఎవరనుకుంటారు. మే 11 న జరగబోయే ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చి ప్రచారం చెయ్యటానికి కూడా జంకు వస్తోంది. ఎందుకంటే బేనజీర్ భుట్టో మరణ సమయంలో ఉన్న పరిస్థితులకంటే ప్రస్తుత పరిస్థితులు పాకిస్తాన్ లో ఇంకా మరీ ఘోరంగా ఉన్నాయి.
భుట్టో కుమారుడు, పిపిపి చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి అక్కడక్కడ పబ్లిక్ లో కనిపించి ఆ తర్వాత ఫోన్ ద్వారా లేక వీడియో ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నారు.
మాజీ నియంత అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఇన్ని సంవత్సరాలూ దుబాయ్ లో అఙాత వాసం చేస్తూ మళ్ళీ ఎన్నికలనగానే పాకిస్తాన్ కి వచ్చి ఎన్నికలలో పోటీ చెయ్యదలచుకున్న విషయం తెలిసిన తాలిబాన్ సంస్థ, ఆయన్ని హతమార్చటానికి ఆత్మాహుతి బాంబు దళం తయారుగా ఉందని స్పష్టమైన సందేశాన్నిచ్చారు. ఆ మాటలను తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే, బేనజీర్ భుట్టో పాకిస్తాన్ కి వచ్చినప్పుడు కూడా అలగే హెచ్చరికలు చేసారు. వినకపోతే బాంబులతో స్వాగతం పలికారు. అందువలన ముషర్రఫ్ తను ముందు అనుకున్నట్లుగా బహిరంగ సభకు హాజరవక, విమానాశ్రయంలోనే గబగబా మాట్లేడేసి, రివ్వున స్పీడ్ కాన్వోయ్ లో అత్యంత భద్రతల నడుమ హోటల్లో బసకు చేరుకున్నారు.
తాలిబాన్ల లక్ష్యం పెషావర్, కరాచీలలో జనసమ్మర్దం ఉండే చోటనే అని భద్రతా దళాలు చెప్తున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ధరించటం, ఎప్పుడూ భారీ భద్రతల మధ్య ఉండటం, బులెట్ ప్రూఫ్ కార్లలో తిరగటం, పార్టీ కార్యాలయాలను బార్బ్ డ్ వైర్ లు, కాంక్రీట్ బ్లాక్స్ తో కాపాడుకుంటూ వుండటం, ప్రసంగాలివ్వటానికి బులెట్ ప్రూఫ్ అద్దం వెనక ఉండి మాట్లాడటం దీని వలన ఎన్నికల ప్రచారం సజావుగా సాగదనే అసంతృప్తి అన్ని పార్టీ నాయకుల్లోనూ కనిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more