హెచ్ 1-బి వీసా కేసులో నేరానికి పాల్పడ్డారన్న ఆరోపణ మీద అమెరికాలోని దల్లాస్ సమీపంలో డిబాన్ సొల్యూషన్స్ పేరుతో నడుపుతున్న ఐటి కన్సల్టింగ్ సంస్థ లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులను అమెరికా పోలీసు అధికారులు అరెస్ట్ చేసారు.
టెక్సాస్ ఉత్తర జిల్లా కోర్టుకి అమెరికా అధికారులు ఫిబ్రవరి 20 న సీల్ చేసిన కవర్లో సమర్పించిన నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2008 నుంచి ఫిబ్రవరి 2011 వరకు నిందితులు మోసపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి-
డిబాన్ కంపెనీవారు టెక్సాస్ లోని కరోల్టన్ లో ఉన్న తమ కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేయటానికని ప్రకటిస్తూ కొందరు కంప్యూటర్ నిపుణులను ఉద్యోగులుగా తీసుకున్నారు. కానీ అలా తీసుకున్న ఉద్యోగులు నిజానికి వాళ్ళు కన్సల్టెన్సీలో ఉన్న వేరే సంస్థలకోసం తీసుకోబడ్డారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి చెప్పింది ఒకటైతే నిందితులు వాళ్ళని వేరే సంస్థల్లో ఉద్యోగానికి పెట్టిన తర్వాత, ఆ సంస్థల వాళ్ళు వారి సేవలకు పారితోషికం అందించిన తర్వాతనే డిబాన్ కంపెనీ వాళ్ళ వాళ్ళకి జీతాలిచ్చారు. అయితే వీసా పొందటంకోసం ఆ ఉద్యోగులు ఫుల్ టైం పనిలో సంవత్సర జీతం పద్ధతిలో నియమించామని అధికారులకు తప్పు ప్రకటనలు చేసారు. దీనితో ఈసంస్థకి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి పనిచెయ్యటానికి, పనిచేసినదానికే డబ్బు ఇచ్చే పద్ధతిలో తేరగా సాంకేతిక నిపుణులైన ఉద్యోగులు దొరికారు. కన్సల్టెన్సీలో పని ఉన్నప్పుడేమో అందులోంచి వీళ్ళకి మంచి కమిషన్ వస్తుంది, పని లేనప్పుడు వీళ్ళు ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన పని లేదు.
పనున్నప్పుడు పిలిచి, అవసరం లేనప్పుడు పనివాళ్ళని పక్కకి పెట్టే పద్ధతిని అమెరికా లేబర్ విధాన పరిభాషలో బెంచింగ్ అంటారు. డిబాన్ సంస్థ హెచ్ 1-బి ఉద్యోగుల నియామకాలు (పర్మనెంట్ పద్ధతిలో) చేసి వాళ్ళని బెంచింగ్ చేసిందని అమెరికన్ అధికారులు ఆరోపించారు. హెచ్-1 బి వీసా మీద నియామకం చేసిన ఉద్యోగులు నిజానికి డిబాన్ సంస్థలో పర్మనెంటుగా పనిచెయ్యాలి. అలాకాకుండా వాళ్ళని ఏ కారణం చేతనైనా ముందు ప్రకటించిన స్థలంలో కాకుండా వేరే చోట పని అప్పగించిన పక్షంలో ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయవలసి వుంటుంది. అలా చెయ్యకపోగా, మధ్యవర్తి సంస్థగా వేరే చోట ఉద్యోగాలకు ఖాళీగా ఉన్నాయని చెప్పిన దానిలో కూడ సత్యం లేదు. ఆయా సంస్థల నుంచి డిబాన్ కి ఎటువంటి ఒప్పందమూ జరగలేదు. ఆ విధంగా డిబాన్ సంస్థ అమెరికా లేబర్ శాఖకు సమర్పించిన లేబర్ కండిషన్ అప్లికేషన్ కూడా తప్పుల తడకే అయింది.
అమెరికా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం, నేరానికి పాల్పడ్డవారిలో డిబాన్ సంస్థాపకులు అతుల్ నందా, జయ్ నందా తో పాటు సంస్థలో విదేశీ ఉద్యోగుల నియామకాలలో ముఖ్యంగా హెచ్-1 బి వీసా నియామకాలను పర్యవేక్షించే ఛీఫ్ రిక్రూట్ మెంట్ అధికారి శివ సుగావనమ్, బెంచ్డ్ వర్కర్లను ఇతర సంస్థలలో పనులకు నియమించే పనిని చూసే ఆఫీస్ మేనేజర్ వివేక్ శర్మ, బెంచ్డ్ ఉద్యోగుల నియామకాలు, వారిని డిబాన్ నుంచి ఇతర సంస్థలకు, అక్కడి నుండి తిరిగి డిబాన్ కి జరిగే తరలింపులను పర్యవేక్షించే రోహిత్ మెహ్రా, డిబాన్ ఉద్యోగుల జీతభత్యాలను చూసే మొహమ్మద్ ఖాన్ మొత్తం ఆరుగురు ఉన్నారు.
ఫిబ్రవరి 27 న కోర్టులో హాజరైన నిందితులు నేరాన్ని అంగీకరించకపోవటం వలన వారిని వారి సొంత పూచీకత్తు మీద వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకుని వదిలిపెట్టారు. నిందితులను వదిలి పెట్టటానికి కోర్టు విధించిన ఇతర షరతులు ఇవి-
నిందితులు ఈ కేసులోని ఇతర నిందితులతోనూ పాత ఉద్యోగులతోనూ కలవటం జరగకూడదు. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో డిబాన్ రికార్డ్ లను కోర్టు అటర్నీ పరిశీలనకు అందుబాటులో ఉంచాలి.
ఇన్ఫోసిస్ ఇమ్మిగ్రేషన్ కార్యకలాపాలు జరుగుతున్నవి కూడా ఆ దగ్గర్లో టెక్సాస్ పూర్వీ జిల్లాలో ప్లానో లోనే. టెక్సాస్ పూర్వీ జిల్లా కోర్టు మే 2011 లో ఇన్ఫోసిస్ కి కూడా ఇమ్మిగ్రేషన్, టాక్స్ కి సంబంధించిన విషయాలలోనూ, బి-1 వీసా ఉపయోగించుకోవటంలోనూ నియమాలను అతిక్రమించిన నేరారోపణ మీద సమన్లు జారీ చేసింది. ఇప్పుడు డిబాన్ సంస్థ మీద జరిగిన నేరారోపణ ప్రభావం ఇన్ఫోసిస్ విచారణ మీద కూడా పడవచ్చునేమో అనే భయాన్ని కొందరు వ్యక్తపరచారు.
ఈ విషయంలో అటర్నీ కెన్నీ మెండిల్ స్హన్ చెప్పినదాని ప్రకారం, టెక్సాస్ ప్రభుత్వం హెచ్-1 వీసాలకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించినవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇన్ఫోసిస్ సంగతి చెప్పేలను కానీ, బి-1 అతిక్రమణలు చాలా పెద్ద నేరంగా పరగణించబడతాయి అని ఆన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more