Ap govt engineers stay in lavish russian hotel

ap govt engineers stay in lavish russian hotel, polavaram tenders issue, trans trai company and another company, fake documentry, russia top hotel, masco radisun hotel, ap govt engineers stay, another company complient ap govt, polavaram tenders scam,

ap govt engineers stay in lavish russian hotel

ap-govt-engineers.gif

Posted: 02/27/2013 12:58 PM IST
Ap govt engineers stay in lavish russian hotel

ap govt engineers stay in lavish russian hotel

పోలవరం టెండర్ల కోసం నిర్మాణ సంస్థల మధ్య సాగుతున్న పోరు పతాక స్థాయికి చేరింది. ట్రాన్స్‌ట్రారు భాగస్వామ్య కంపెనీ యుఇఎస్‌ చేసిన పనులను పరిశీలించడానికి రష్యాకు వెళ్లిన ఇంజినీర్ల బృందం అక్కడ జల్సా చేసిందని మరో నిర్మాణ సంస్థ సోమా ఆరోపించింది. పనులను పరిశీలించకుండానే ఆ సంస్థకు అనుకూలంగా నివేదిక ఇచ్చారని పేర్కొంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీనికోసం ఆ సంస్థ రష్యాలో ఇంజినీర్ల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది. అడుగడుగునా వారి కదలికలను రికార్డు చేసింది. పూర్తిస్థాయిలో ఆధారాలను సమర్పించింది. ఇంజినీర్లు బస చేసిన హోటల్‌ నుండి వారు అక్కడ వాడిన విలాసవంతమైన కార్ల వరకు సాక్ష్యాలు సేకరించింది. వీటన్నింటిని ప్రభుత్వానికి అందచేసిన సోమ సంస్థ, ఇంజినీర్ల తీరుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. టెండర్ల దక్కించుకోవడం నిర్మాణ సంస్థల మధ్య పోటీ జరగడం సహజమే అయినప్పటికీ, ఈ స్థాయిలో నిఘా పెట్టి సాక్ష్యాలు సేకరించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. సోమా కంపెనీ అందించిన ఆధారాలతో రష్యాకు వెళ్లిన ఇంజినీర్ల చుట్టూ ఉచ్చుబిగుసుకున్నటైంది. టెండర్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సమావేశం కానున్న నేపధ్యంలో తాజా వివాదం ఆసక్తి కరంగా మారింది. పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్లకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ స్థాయి హోటళ్లలో బస ఏర్పాటు చేసిందని, దానికి భిన్నంగా రష్యాలోనే అత్యున్నతస్థాయికి చెందిన హోటల్‌లో వారు బస చేశారని సోమా ఆరోపించింది.  

ap govt engineers stay in lavish russian hotel

సాధారణంగా రష్యాకు ఇతర దేశాల అధినేతలు పర్యటనలకు వచ్చినప్పుడు ఆ హోటల్‌లో అక్కడి ప్రభుత్వం బస ఏర్పాటు చేస్తుందని ఆ కంపెనీ చెబుతోంది. అంత విలాసవంతమైన హోటల్‌లో బస చేయడానికి సాధారణ ఇంజినీర్లకు నిధులు ఎక్కడి నుండివచ్చాయో తేల్చాలని కోరింది. ఇంజినీర్లు బస చేసిన రోజుల్లో అదే హోటల్‌లో ట్రాన్స్‌ట్రారుకు చెందిన వైస్‌ఛైర్మన్‌ కూడా బస చేశారని ఆరోపించిన సోమా దానికి సంబంధించిన హోటల్‌ బిల్లులను ప్రభుత్వానికి సమర్చించింది. వీటితో పాటు, ట్రాన్స్‌ట్రారు వైస్‌ఛైర్మన్‌, ఇంజినీర్లు కలిసి ఉన్న ఫోటోలనూ అందచేసింది. విలాసవంతమైన హోటల్‌లో బస చేయడానికి అవసరమైన నిధులను ట్రాన్స్‌ట్రారు సమకూర్చుకుందని, రష్యాలో అడుగడుగునా వారిని ప్రలోభ పెట్టిందని ఆరోపించింది. పనులు పరిశీలించడానికి వెళ్లిన ఇంజినీర్లు అసలు ఆ పనే చేయలేదని పేర్కొంది. పనులు పరిశీలించడానికి రష్యా ప్రభుత్వం అనుమతించిన తేదిల్లో, వారు అక్కడకు వెళ్లనే లేదని తెలిపింది. ఎటువంటి కారణం లేకుండానే ఆ తేదిల్లో పర్యటనను వాయిదా వేయాలని ఇంజినీర్లు కోరారని, ఆ తరువాత పరిశీలనకు అక్కడి ప్రభుత్వం అనుమతించనే లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి రష్యా ప్రభుత్వానికి ఇంజినీర్లు రాసిన కొన్ని లేఖలను కూడా వారు ఫిర్యాదు పత్రానికి జత చేశారు. ఈ విషయంలో రష్యా ప్రభుత్వాన్ని వివరణ కోరితే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. రష్యా ప్రభుత్వం అధికారికంగా అనుమతించిన తేదిల్లో పరిశీలనకు వెళ్లకుండా ఇంజినీర్లు ఏం చేశారో విచారించాలని సోమా డిమాండ్‌ చేసింది. రష్యాలో వారు వాడిన విలాసవంతమైన వాహనాలపై కూడా విచారణ జరపాలని కోరింది.

ap govt engineers stay in lavish russian hotel

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namrata shirodkar tattooed mahesh babu and children names
Kotla surya prakash reddy comments on railway budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more