దిల్ సుఖ్ నగర్ బాంబులు పేలుడు గాయం ఇంక మానకముందే. నగరం వాసులకు మరో భయం పట్టుకుంది. దిల్ సుఖ్ నగర్ లో బాంబులు పేల్చింది మేమే? అనే వార్తలు నగరంలో హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు .. మా తరువాత టార్గట్ .. బేగం బజార్? అని ఉగ్రవాదులు ఒక లేఖ రాసినట్లు సమాచారం. ఆ లేఖ రాసింది లష్కరే తొయిబా..హైదరాబాద్ లో మరిన్ని పేలుళ్లకు పాల్పడతామని అందులో హెచ్చరించారు. అయితే ఈ లేఖ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి రావటం విశేషం. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పోలీసులకు ఈ సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ లేఖ పై వాస్తవం ఎంత అనేది పోలీసులు కనుగోనే పనిలో బిజీగా ఉన్నారు. బీజేపి నాయకుడు కిషన్ రెడ్డి మాత్రం ఇది ఆకాతాయిల పనే కావొచ్చునని అంటున్నారు. అయితే ఆ లేఖ పరిశీలించిన పోలీసులు ఇది లష్కరే తొయిబా తీవ్రవదులే పంపించి ఉంటారని భావిస్తున్నారు. దీంతో నగరంలో మరోసారి మారణహోమం జరిగే ప్రమాదం లేకపోలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న బేగం బజార్ వాసులకు టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ..ఏ వైపు నుంచి బాంబులు వచ్చిపడతాయోనన్న టెన్షన్ తో క్షణమొక యుగంగా గడుపుతున్నారక్కడి జనం.
ఉగ్రవాదుల అడ్డాగా మారిన హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వీరికి పాస్ పోర్టులు , ఓటరు ఐడీ కార్డులు , రేషన్ కార్డులు , బ్యాంకు అకౌంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ లేఖతో అప్రమత్తమైన పోలీసులు భద్రతాబలగాలు అక్కడ హై అలర్డ్ ప్రకటించి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మన నగరం బాంబుల మోతకు కారణం ఎవరు ? మనమే. పోలీసులు ఉన్నార్లే అన్నీ వాళ్లే చూసుకుంటారు అనే మన బలహీనతకు నిదర్శనం దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు. ఇలాంటి విషయంలో పోలీసులే కష్టపడాలా? మనం సుఖంగా ఇంట్లో ఉండాలా? మనం కూడా పోలీసులకు హెల్ప్ చేద్దాం. మన నగరాన్ని కాపాడుకుందాం. హైదరాబాద్ ప్రజలారా పోలీసులకు సహకరించండి? మీచుట్టు జరిగే ఉన్న పరిసరాలను ప్రతి నిమిషం గమనిస్తూ, అనుమానం వస్తే.. పోలీసులకు చెప్పండి? ఆ ఒక్క పని చేస్తే.. మీరు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడినట్లే. మరోసారి ఇలాంటి వాటికి మనం అవకాశం ఇవ్వొద్దు? ఏదో జరిగిన తరువాత బాధపడటం సహజం,కానీ ముందుగా ఏమీ జరకుండా చూడటం మన కనీస ధర్మం. హైదరాబాదును కాపాడుకుందాం .. అందరం హయిగా జీవిద్దాం. నగర వాసులు బీ కేర్ పుల్ ....
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more