దిల్ సుఖ్ నగర్ బాంబు దాడిలో ఘటనా స్థలిలో కొన్ని ఆధారాలు దొరికాయని, వాటి ద్వారా ఆచూకీ తీస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిన్న కోలకతా లో ప్రకటించారు.
దిల్ సుఖ్ నగర్ లోని శిల్పి లాడ్డి రూం నంబర్ 303 ని బసగా చేసుకుని ఉగ్రవాదులు తమ కార్యకలాపాన్ని నిర్వహించారని పోలీసు దర్యాప్తులో తేలింది. 14 రోజుల ముందుగానే బుక్ చేసుకున్న రూం నంబర్ 302, 302 లలో 302 ని ఖాళీగానే ఉంచారు. గదులను బుక్ చేసిన మనిషి సుభానీ కానీ విజయ్ పేరు మీద బుక్ అయింది. విజయ్ వచ్చాడు, ఫిబ్రవరి 15న 303 గదిలోకి మరో ఇద్దరు వచ్చి చేరారు. వాళ్ళు సాజిద్, అలీఖాన్ లు. 16 వ తారీఖు తర్వాత చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయిన వీళ్ళిద్దరూ ఇచ్చిన వ్యక్తిగత వివరాలు భూటకాలు. 21 వ తారీఖున అదే గదిలోకి వచ్చిన రాజు కూడా నకిలీ ఓటర్ కార్డ్ కాపీ ఇచ్చాడు. పేలుళ్ళు జరిగిన రోజున సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వెళ్ళిన సదరు వెంకటేశ్వరరాజు పేలుళ్ళ తర్వాత 8 గంటలకు వచ్చి, హోటల్ యాజమాన్యానికి చెప్పకుండా గది ఖాళీచేసి వెళ్ళిపోయాడు. అతడిచ్చిన మిర్యాల గూడా అడ్రస్ నకిలీ అని తేలింది. అలా అదే రోజు వచ్చి, వెళ్ళిపోయిన రాజుని ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ కి భారత నాయకుడైన యాసిన్ భత్కల్ తో సన్నిహిత సంబంధాలున్న అక్తర్ అని పోలీసులు సిసి కెమేరాల ఆధారంగా గుర్తించారు.
ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలోని సభ్యుడు మఖ్బూల్ తో సంబంధముందని అనుమానించిన పోలీసులు పాత బస్తీలోని పాల వ్యాపారి మహ్మద్ రియాజుద్దీన్ ని అదుపులోకి తీసుకున్నారు. మక్కా మసీదు పేలుళ్ళలో సంబంధముందన్న అనుమానంతో లోగడ అరెస్ట్ చేసి చర్లపల్లి జైలులో ఉంచినప్పుడు అతనికి అక్కడ మఖ్బూల్ తో పరిచయం ఏర్పడిందని తెలిసింది. కానీ ఇతనికి మక్కా మసీదు పేలుళ్ళతో సంబంధం ఉన్న ఆధారాలేమీ లేనందున కేసు నుంచి బయటపడ్డాడు. మఖ్బూల్ విడుదలయిన తర్వాత రియాజుద్దీన్ పక్కనే బస చేసాడని, అతను హైద్రాబాద్ వదిలిపెట్టి పోయిన తర్వత కూడా రియాజుద్దీన్ అతనితో ఫోన్ లో సంభాషణ జరిపేవాడని పోలీసుల భావన.
జాతీయ దర్యాప్తు సంస్థ ఏ ఆధారాన్నీ వదిలిపెట్టకుండా దర్యప్తుని చేస్తోంది. ఒక ఉగ్రవాది కన్యాకుమారిలో దాక్కున్నట్టు, కొందరు నేపాల్ వైపు పోతున్నట్టు కూడా దర్యాప్తు సంస్థ ఆచూకీ తీసింది.
నగరంలోని స్థానిక, కేంద్ర బలగాలు, జాతీయ దర్యాప్తు సంస్థ ఇలా అన్ని పోలీసు వర్గాలూ చేస్తున్న వేట లో బాంబు దాడికి పాల్పడిన దుండగులు పట్టుబడతారనే ఆశాభావం కనిపిస్తోంది. పైగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more