Maldieves ex president takes shelter in indian mission there

mohammad nasheed, maldieves, india, external affairs ministry, mohammad waheed

maldieves ex president takes shelter in indian mission there

maldieves-problem.png

Posted: 02/20/2013 05:24 PM IST
Maldieves ex president takes shelter in indian mission there

     మన దేశ పొరుగు ద్వీప వాసులైన మాలె లో రాజకీయ వైరాలు చాలాకాలంగా సెగలు కక్కుతున్నాయి.  ఈ సంవత్సరం  ఫిబ్రవరి 13 నుండి మాలె లోని భారత దౌత్య కార్యాలయంలో ఆ దేశపు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్mohd-nasheed తలదాచుకుని ఉన్నారు.  ఆయన మీద అరెస్ట్ వారెంటు ఉంది.  కానీ ఆయన కోర్టులో హాజరవలేదు.  మహమ్మద్ నషీద్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సమయంలో ఆయన ఛీఫ్ క్రిమినల్ జడ్జ్ అబ్దుల్లా మొహమ్మద్ ను నిర్బంధంలో ఉంచారనే ఆరోపణ ఉంది.  కానీ అది రాజకీయ కుట్రపూరితమైన ఆరోపణ అంటూ నషీద్ పార్టీ నాయకులు అంటున్నారు.  ఆ నేరారోపణ మీద అరెస్ట్ వారెంటు జారీ అవగానే నషీద్ మన దౌత్యకార్యాలయంలోకి వచ్చి అక్కడ తలదాచుకున్నారు.  విదేశ కార్యాలయాల పట్ల ఉన్న అంతర్జాతీయ కట్టుబాట్ల వలన మాలె అధికారులు భారత్ కార్యాలయంలోకి పోలేరు కనుక నషీద్ ఎనిమిది రోజులవుతున్నా అరెస్ట్ భయంతో అందులోంచి బయటకు రావటం లేదు. 

     ఈ పరిస్థితిని చక్కదిద్దటానికే మనదేశ విదేశాంగ శాఖ నుంచి అధికారుల బృందం మాలె లో అడుగుపెట్టారు.  ఈ సమస్యకు పరిష్కారం దొరికితే అంతకంటే ఆనందం మరేదీ ఉండదని విదేశాంగ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ న్యూఢిల్లీలో అన్నారు. 

     ఈ నేపథ్యంలో నషీద్ ని ఈ రోజు కోర్టులో హాజరుపరచవలసిందిగా మాల్దీవుల కోర్టు పోలీసులను ఆదేశించింది.  ఈ చిక్కు ముడిని విప్పటం కోసమే భారత విదేశాంగ శాఖ అధికారులు మాలె లోని భారత దౌత్య కార్యాలయానికి వెళ్ళారు. 

     మహమ్మద్ నషీద్ పార్టీ వర్గంలోని ప్రధాన సభ్యులు, నషీద్ ఎటువంటి పరిస్థితుల్లోనూ భారత విదేశాంగ దౌత్య కార్యాలయాన్ని వదిలి బయటకు రారని గట్టిగా చెప్పారు. 

     ఇంతకాలం మాలె పరిస్థితుల మీద నోరు విప్పని చైనా ఈరోజు ఈ సమస్యను భారత్ పరిష్కరించాలని ప్రకటించింది.  అందుకు కారణం చైనా పెట్టుబడులు ఆ దేశంలో ఉండటమే.  అయితే అక్కడ విమానాశ్రయం పర్యవేక్షించే భారత్ కి చెందిన జిఎమ్ ఆర్ సంస్థను మల్దీవ్స్ నుండి బయటకు పంపించేయటంలో చైనా ప్రమేయమేమీ లేదని అప్పట్లోనే మాలె అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ ప్రకటించారు. 

      ఈ చిక్కు ముడి విడిపోయి భారత్ దౌత్య సంబంధాలు పదిలంగా ఉండాలని విదేశాంగ శాఖ వేయి దేవుళ్ళకి మొక్కుకుంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shinde says sorry regrets hindu terror remarks
Chandrababu padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more