Congress party ex mla gandi babji demands ban on naayak movie

naayak movie , ram charan, amala paul, kajal, gandi, gandi babji congress ex mla, gandi babji name used in nayak movie, gandi babji name vilan charactor, pawan klayan, mohan babu, tollywood movies, telugu movies,controversy, shop names, food names,

Congress Party Ex MLA Gandi Babji Demands Ban on Naayak Movie

Ex MLA  Gandi Babji.gif

Posted: 01/10/2013 11:44 AM IST
Congress party ex mla gandi babji demands ban on naayak movie

Congress Party Ex MLA  Gandi Babji Demands Ban on Naayak Movie

టాలీవుడ్ సినిమాలకు  దిష్టి  తగిలిందా?  ప్రతి కొత్త సినిమా పై ఏదో ఒక విమర్శలు వస్తునే ఉన్నాయి. మొన్న  దేనికైనా రెఢీ అనే సినిమా పై రాష్ట్రంలోని  బ్రహ్మణులు మేం దేనికైనా రెఢీ అంటూ ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.   ఆ ఆందోళనలు నటుడు మోహన్ బాబు కుంటుంబ సభ్యులు  అడ్డుకోవటం, వారి పై కేసులు పెట్టుకోవటం ఇప్పటికి ఆ మంటలు  ఇంక రగులుతూనే ఉన్నాయి.  నిన్న పూరి జగన్  దర్శకత్వంలో   పవన్ కళ్యాణ్  హీరోగా వచ్చిన సినిమా  కెమెరామెన్ గంగతో రాంబుబు. ఈ సినిమా పై  ఒక ప్రాంతం ప్రజలు రచ్చ రచ్చ చేసి  ఆ సినిమా ను దెబ్బ తీశారు.  నేడు  రామ్ చరణ్  నటించిన  సినిమా  నాయక్ సినిమా పై విమర్శలు  మంటలు  రేపుతున్నారు.  ఆ సినిమాలో  మా బాషను  కించపరిచారు,  ఆ సినిమా కు  మా పేరు పెట్టాకున్నారు.  ఆ సినిమాలో బ్రహ్మణులను కించపరిచారు?  అని  ఆందోళనలు, నిరసనలు  కొంతమంది ప్రజలు  చేస్తున్నారు. ఇలా చేసి  మన సినిమా పరిశ్రమను మనం దెబ్బతీసుకుంటున్నాం అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి?   సినిమా అనేది  వినోదం కోసమే అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాని గురించి ప్రత్యేకించి  ఎవరికి చెప్పనవసరం లేదు. కానీ కొంత మంది, రాజకీయ కుట్రలకు, తమ రాజకీయ  ఎదుగుదల కోసం, తెలుగు సినిమాలను పావుగా వాడుకుంటున్నారు. మన తెలుగు సినిమలపై మనమే బురద జల్లుకుంటున్నాం అనే విషయం మరిచిపోతున్నారు.  ఇప్పుడు నాయక్ సినిమాలో విలన్ రాహుల్ దేవ్  పాత్రకు  ‘గండి బాబ్జీ’  అని పేరు పెట్టారు దర్శకుడు.  ఇప్పుడు  ఆపేరు తో పెద్ద సమస్య రాబోతుంది.  గండి బాబ్జీ అనే అతను   నాయక్ సినిమా పై  అభ్యంతరం తెలుపుతున్నాడు.  ఆ పేరు వెంటనే తొలగించాలని  ఆయన డిమాండ్ చేస్తున్నారు. 

Congress Party Ex MLA  Gandi Babji Demands Ban on Naayak Movie

ఇతను  కాంగ్రెస్ పార్టీ  మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు  ఆయన వైఎస్  జగన్ పార్టీ చేరినట్లు తెలుస్తోంది.  ఆ పేరు పెట్టడం పై  మాజీ ఎమ్మెల్యే  గండీ బాబ్జీ  అనుచరులు,  వైసీసీ  కార్యకర్తలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయం పై  చిత్ర దర్శకుడు  వీవీ వినాయక్ తో ఫోన్ లో  మాట్లాడినట్లు తెలుస్తోంది. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే  సినిమా థియేటర్లను  ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇలా మాజీ ఎమ్మెల్యే  కేవలం పేరు కోసం  ఇలా  చేయటం మంచిది కాదని  సినీ ప్రజలు అంటున్నారు.  ఆయన పేరు కోసమే  ఇలా చేస్తే  .. సమాజంలో  చాలా మార్పులు చేయాలని సినీ ప్రజలు అంటున్నారు.  కొన్ని  దుకాణల పేర్లు  పరిశీలిస్తే ..  బాబ్జీ  బాజ్జీల  బండి,  శ్రీనివాసరావు  వైన్స్ షాపు,  మస్తాన్ మటన్ షాపు,  సితమ్మ కిళ్లి కొట్టు, కిరణ్ కిరాణ షాపు,  చంద్రబాబు చెరుకు రసం బండీ,  జగన్ బుక్ షాపు, నారాయణ చికెన్  షాప్,  సోనియా బ్యూటి పార్లల్,  ఇలా  చెప్పుకుంటు పోతే  అనేక  పేర్లతో  మన కళ్ళ ముందు  ప్రతి రోజు కనిప్పిస్తుంటాయి. కానీ వాటి మీద ఎవరు పైట్ చేయలేదే?  అది సమాజం కాబట్టి , ప్రతి ఒక్కరికి  ఉపయోగపడే వస్తువులు అక్కడ దొరుకుతాయి కాబట్టి  ఆ షాపుల మీద ఎవరు వివాదం చేయరని సినీ ప్రజలు  అంటున్నారు.  అలాగే మనం తినే పదార్థల పేర్లు కొన్ని ప్రాంతలకు సంబంధించి పేర్లే ఉంటాయి? ఆ ప్రాంతం వాళ్లు గొడవలు చేయలేదు ఎందుకు? మనం ఒక్కసారి ఆలోచించాలి?  పుల్లరెడ్డి స్వీట్స్,  మైసూర్ బజ్జీ,   మైసూర్ బొండ,  కాకినాడ ఖజాలు,  చైనీస్ పుడ్, బెంగుళూరు బొండం, బధ్రీనాథ్  బందర్ మిఠాయి , ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు మనం ప్రతి రోజులు పలుకుతునే ఉంటాం, వాటిని  తింటునే ఉంటాం. ఇలా ప్రతి ఒక్కటి  భూతద్దంలో పెట్టి  చూస్తే మనిషి  చంద్రమండలానికి వెళ్లేవాడే కాదని సీని ప్రజలు అంటున్నారు.  ప్రతి ఒక్కదాని  తప్పుడు  వెతికి రాజకీయంగా పైకి రావాలని చేస్తే  ప్రజలు అన్ని గమనిస్తుంటారు.  ఏదో ఒక రోజు ప్రజలు తిరిగి గుణపాఠం చెబుతారు. ఇలాంటి వివాదాలు తావులేకండా ఆనందంగా  సినిమాలు చూడమని  సినీ ప్రజలు   చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress party leaders wants to recreation club
Acid attack on kangna sister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more