అందమైన అమ్మాయిని చూస్తే ఎలాంటి వారికికైన రిమ్మతెగులు పెడుతుంది. ఆమె అందం చూసి పడిపోయే మగరాజులు చాలా మంది ఉన్నారు. మరికొంతమంది ఆమె అందంతో పాటు ఆమె లో ఉన్న విలక్షణమైన లక్షణం చూసి ప్రేమలో పడిపోతారు. అలాగే అమ్మాయిలు తమ అందంతో బుట్టలో పడేసే అమ్మాయిల్ని చూశాం. కానీ ఓ అమ్మాయి లంచ్ బాక్స్‌తో ఒకతన్ని బుట్టలో వేసింది. మరి అతనెవరో చెప్పాలిగా? తను ఎవరో కాదు.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్. ఏంటి? అక్షయ్‌ని సోనాక్షి ప్రేమలో పడేసిందా? అనుకుంటున్నారా! సరే అసలు విషయంలోకెళదాం. వీరిద్దరూ కలిసి గత ఏడాది ‘రౌడీ రాథోడ్’తో బాక్సాఫీస్ దగ్గర హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ వీరిద్దరూ ‘వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ చిత్రంలో కలిసి పనిచేస్తున్నారు. ఆ సమయంలో సోనాక్షి డ్యాన్స్ మాష్టార్ ప్రభుదేవాతో కొంచెం రొమాన్స్ నడిపిందని బాలీవుడ్ వర్గాలు అప్పట్లో చెప్పుకున్నాయి. అయితే సోనాక్షి ప్రేమలో ప్రభుదేవా లేడట? ఆ ప్రేమ గదిలో మరో హీరో ఉన్నట్లు తెలుస్తోంది. అతనే అక్షయ్ కుమార్. అంటే ఏడాది నుంచి ఇద్దరూ కలిసి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారన్నమాట. ఈ ఏడాది కాలంలో సోనాక్షి లంచ్ బాక్స్‌పై అక్షయ్‌కి మమకారం విపరీతంగా పెరిగిపోయింది. షూటింగ్ రావడం అలస్యం.. ‘ఏంటి ఈరోజు లంచ్ బాక్స్ స్పెషల్’ అని అడిగి మరీ తెలుసుకుంటాడట అక్షయ్.
ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం సోనాక్షికి మొదటి నుంచీ అలవాటు. తక్కువ కాలరీలతో రుచికరమైన నాన్‌వెజ్ ఐటమ్స్‌ని వండి ప్రత్యేకంగా లంచ్ బాక్స్‌ని ప్రిపేర్ చేస్తుందట సోనాక్షి తల్లి పూనమ్.అక్షయ్ కుమార్‌కి కూడా ఇంటి నుంచే లంచ్ వస్తుంది. కానీ ఇంట్లో అందరూ వెజిటేరియన్స్. దాంతో సోనాక్షి లంచ్‌బాక్స్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాట్ట అక్షయ్. అందుకే సోనాక్షి వాళ్లమ్మక్కూడా చెప్పేసిందట, ‘ఇద్దరికి సరిపోయేలా లంచ్ ప్రిపేర్ చేయ్’ అని. ఈ లంచ్‌బాక్స్ పుణ్యమా అని తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో కూడా సోనాక్షినే కథానాయికగా అక్షయ్ ఎంచుకుంటాడేమో! అని బాలీవుడ్‌లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more