రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని డిజిపి దినేష్ రెడ్డి తెలిపారు. మావోయిస్టుల కార్యకలాపాలు, మతపరమైన ఘర్షణలు కూడా పూర్తిగా అదుపులోనే వున్నాయని చెప్పారు. మహిళలపై అత్యాచారాల నివారణకు రాష్ట్రంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసుల సాయం కోసం 100 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చన్నారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ రాత పరీక్షల్లో నెగెటివ్ మార్కుల విధానాన్ని వచ్చే రిక్రూట్‌మెంట్ నుంచి రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన వార్షిక మీడియా సమావేశంలో దినేష్ రెడ్డి మాట్లాడారు. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపుల వంటి తీవ్రమైన నేరాలు చాలా వరకు తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు సైతం తగ్గాయని ఈ విషయంలో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ఢిల్లీ తరహా ఘటనలు రాష్ట్రంలో జరిగేందుకు గల ఆస్కారాలు వున్నాయా..? అన్న ప్రశ్నకు అక్కడి పరిస్థితులకు ఇక్కడి పరిస్థితులకు చాలా వరకు తేడా వుందని అన్నారు. అత్యాచారాలు వంటి తీవ్రమైన కేసుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2012లో శాంతి భద్రతల పరిస్థితి అంతా సాఫీగానే వుందని, తెలం గాణా మార్చ్‌తో పాటు ఉప ఎన్నికలు కూడా శాంతియుతంగానే జరిగాయని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మావోల కార్యకలాపాలు ఎక్కువగానే వున్నా మన రాష్ట్రంలో వారి ఆగడాలు సాగనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డిజిపి తెలిపారు. ప్రస్తుతం మావోల సంఖ్య 300కు మించి లేదని ఇందులో 200 మంది వరకు ఇతర రాష్ట్రాలలో వున్నారని, మిగతా వారు సరిహద్దు ప్రాంతాలలో వున్నారని, వీరిపై నిరంతరం నిఘా వుంచుతున్నామని దినేష్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో పోలీసు శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజిక వర్గానికి ఒక డిఎస్‌పి ఉండేలా చూస్తామని, పోలీసు స్టేషన్లను కూడా బలోపేతం చేస్తామని, మహిళా పోలీసు స్టేషన్లలో మహిళా సిబ్బందిని పెంచుతామని ఆయన అన్నారు. పోలీసు రవాణా విభాగాన్ని ప్రక్షాళన చేసి చక్కదిద్దుతామని, సిఐడి విభాగానికి కేసుల బదలాయింపులను తగ్గిస్తామని, అవసరమైతే తప్ప ఇక్కడికి కేసులను మార్చబోమని, నేరుగా కేసులు నమోదు చేయబోమని డిజిపి వివరించారు. బషీర్‌బాగగ్ కాల్పుల కేసు విచారణ మళ్లీ మొదలు కావడం సాధారణ చర్యేనని దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వవద్దని ఆయన అన్నారు. సూరి హత్య కేసులో అందరు నేరగాళ్లు అరెస్టయ్యారని ఒక ప్రశ్నకు డిజిపి జవాబిచ్చారు. కార్ల అద్దాలకున్న బ్లాక్ ఫిల్మ్ తొలగింపు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని, ఇది మంచి ఫలితాన్నిస్తుందని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more