ధర్మాన ప్రాసిక్యూషన్ విషయంలో రాష్ట్ర సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాసిక్యూషన్‌ను నిరాకరిస్తూ రాష్ట్ర కేబినెట్ పంపిన ఫైలును గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ తిప్పిపంపారు. ఈ విషయం వెలుగులోకి వచ్చినా, కొద్ది రోజుల కిందటే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చినప్పుడే ఇంచుమించు ఇది జరిగినట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ప్రభావాలు లేవనీ, కేవలం కేసు మంచీచెడులను బట్టి ఆయన విచక్షణ ఉపయోగిస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ నిందితునిగా పేర్కొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ఫైలును గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రభుత్వానికి తిప్పి పంపించారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. సిబిఐ కోరినట్టుగా మంత్రి ధర్మానను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం కోసం సంబంధిత ఫైలును ప్రభుత్వం పంపించింది. ధర్మానను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి నిరాకరిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీసింది. ఆదే సందర్భంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించాలంటూ గవర్నర్‌పై ఒత్తిడి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ఫైలును గవర్నర్ ప్రభుత్వానికి తిప్పి పంపించడం గమనార్హం. కాగా, జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితునిగా ఉన్న ఐఆర్ఎఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐకి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి వాన్‌పిక్ కేసులో బ్రహ్మానందరెడ్డిని నాలుగో నిందితునిగా సిబిఐ పేర్కొంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో బ్రహ్మానందరెడ్డి పెట్టుబడులు, వౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శిగా పని చేశారు. మంత్రి ధర్మానతోపాటు మరికొందరు ఐఏఎస్ అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఐఆర్ఎఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిని విచారించేందుకు సిబిఐకి అనుతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అయితే కేబినెట్ ఫైలును తిప్పిపంపిన గవర్నర్ పలు సందేహాలను లేవనెత్తినట్లు తెలిసింది. దాదాపుగా రెండు పేజీల్లో ఈ సందేహాలను ప్రభుత్వం ముందుంచారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించే ఫైలును మాత్రం ఆమోదింపచేసుకుని చిక్కుల్లో పడతారేమో ఆలోచించుకోవాలన్న హితబోధ వాటిలో ఉన్నట్లు సమాచారం. విశ్వస నీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం... జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఇతర మంత్రుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ధర్మానకు ప్రాసిక్యూషన్ నిరాకరిస్తే ఇతర మంత్రుల విషయంలో ఎలా వ్యవహరించ నున్నారని ఆయన ప్రశ్నించారు. 'దీనిపై లోతుగా ఆలోచించినట్లు కనిపించడంలేదు' అని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇప్పటికే అరెస్ట్ అయి జైలులో ఉన్న మోపిదేవి వెంకటరమణ విషయాన్ని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తా వించినట్లు తెలిసింది. 'ఇప్పటికే అరెస్ట్ అయిన వారి విషయంలో ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుంది' అని ఆరా తీశారు. పలు న్యాయపరమైన సందేహాలను కూడా ఆయన లేవనెత్తారు. గవర్నర్‌కు పంపిన నోట్లో కేబినెట్ ప్రస్తావించిన ఒకటి, రెండు కేసులకు సంబంధించి కూడా ఆయన మరికొంత వివరణ కోరారు. మధ్యప్రదేశ్‌లో ఇదే తరహాలో తలెత్తిన అంశంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్ నిరాకరణకు సంబంధించి పూర్తిస్థాయిలో న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని మంత్రిమండలికి సూచించారు. మొత్తం మీద ధర్మాన ఫైలు తిప్పిపంపడం ద్వారా మిగతా మంత్రుల సమస్యను కూడా గవర్నర్ రంగం మీదకు తెచ్చారు. ఇప్పుడు దాన్ని మళ్లీ తిప్పిపంపితే రేపు ఇతరులకూ ఇదే న్యాయం వర్తింపచేయాల్సి వస్తుందా అనేది ఒకటైతే, ఇలా అందరికీ విడివిడిగా ప్రాసిక్యూషన్ నిరాకరిస్తూ పోవడం వల్ల ప్రభుత్వంపైన, గవర్నర్‌పైన ఏ ప్రభావం పడుతుందనేది మరో ప్రశ్న అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ధర్మాన ఫైలును తిప్పిపంపుతున్న విషయంపై ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు గవర్నర్ ముందుగానే సమాచారం అందచేశారు. కేబినెట్ నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ఆయన ఒకరిద్దరు కీలక నేతలకు వివరించినట్లు సమాచారం. 'న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకోండి' అంటూ అధిష్టానం నుండి అందిన సంకేతాలతోనే ధర్మాన ఫైలును తిప్పిపంపాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారంటున్నారు. అంతకుముందు దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను గవర్నర్ లోతుగా పరిశీలించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌తోపాటు, పలువురు న్యాయనిపుణుల అభిప్రాయాలను ఆయన తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more