తమిళ నటి ఖుష్బు చీర విషయం పెద్ద వివాదం అయిన విషయం తెలిసిందే. ముస్లిం మహిళ అయిన ఖుష్బు హిందువులను కించపరిచేవిధంగా చేస్తుందని హిందు సంఘాలు మండిపడుతున్నాయి. ముస్లిం స్త్రీ అయిన ఆమె హిందు సంప్రాదయ పద్దతులను పాటించే ఖుష్బు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించటంతో వివాదానికి దారితీసింది. అయితే ఆమె చేసిన పనికి హిందు సంఘాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఖుష్బు క్షమాపణ చెప్పకుండానే హిందు సంఘాల మీద ఆమె మండిపడుతుంది. ఇటీవల ఒక తెలుగు ఆడియో ఆవిష్కరణలో పాల్గొన్న ఖుష్బూ .. రాముడు, క్రిష్ణుడు, ఆంజనేయస్వామి చిత్రాలతో కూడిన చీరను ధరించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ విషయంపై మక్కల్ కట్చి తీవ్రంగా స్పందించింది. ఖుష్బు తరచూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడింది. అయితే అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న నటి ఖుష్బు వారి పై మండిపడినట్లు తెలుస్తోంది. పని లేనోళ్లు, తన పేరు చెప్పుకొని పబ్లిసిటీ కోసం కుప్పిగంతులు వేసే వారందరి గురించి ఆలోచించే సమయంలో లేదని ఖుష్బు సిరియస్ గా అన్నారు. అంతేకాకుండా.. పనీ పాటా లేనోళ్లు చేసే ఆరోపణల గురించి పట్టించుకోను.. ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి అంటూ హిందు సంఘాలపై నిప్పులు చెరిగారు. హిందు దేవుళ్లు అంటే నాకు ఇష్టమేనని ఆమె అన్నారు. చీరలో ఉన్న దేవుళ్లు లను చూసి నా విమర్శలు చేయటం మంచిది కాదని ఆమె సూచించారు. నేను తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ నే కానీ, నాకు హిందువుల విలువల గురించి తెలుసునని ఆమె అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే .. మనిషి జీవించటమే చాలా కష్టమని ఖుష్బు చెబుతున్నారు. అయితే ఖుష్బు ఇచ్చిన వివరణ పై హిందు సంఘాలు ఏం అంటాయో చూడాలి...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more