దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీకి 2012 సంవత్సరంలోనే జాతీయ అర్హత ప్రవేశ పరీక్షను అమలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది ? ఈ నిర్ణయం పై కొన్ని కొన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గి 2013 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది . దీని పై తీర్పు సుప్రీం కోర్టు నుండి వస్తేనే దాని ఆధారంగా సీట్ల భర్తీ జరుగుతుంది. అప్పటి వరకు ఏ పరీక్ష నిర్వహిస్తారో, విద్యార్ధులకు ఏం చేయాలో దిక్కు తోచడంలేదు. డిసెంబర్ 1 నుంచి 31 వరకు నెలరోజులు మాత్రమే గడువు విధించడంతో ఈ పరీ క్షలు విద్యార్ధులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవ సరం ఏర్పడింది. నీట్‌పై సుప్రీంకోర్టు ఎంసీఐకి అనుకూలంగా తీర్పు ఇస్తే ఆ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని 5,500 ఎంబీబీఎస్ సీట్లు, 1,910 బిడిఎస్ సీట్లను భర్తీ చేస్తారు. అందు వల్ల దరఖాస్తు చేసుకోకుంటే విద్యార్ధులు నష్టపోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ‘నీట్-2013’ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిషోర్ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సిలబస్‌లో మార్పులు చేసుకోవాలని కోరినా ఇంటర్మీడియట్‌లో ఆ మార్పులు జరగనందున ఈ విద్యా సంవత్సరంలో మినహాయింపు ఇవ్వాలని భారతీయ వైద్య మండలితోపాటు కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది.మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు ప్రైవేటు వైద్య కళాశాలల్లోని యాజమాన్య కోటాలో చేరేందుకు కూడా జాతీయస్థాయి ప్రవేశపరీక్ష తప్పని సరిగా నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లోని విద్యార్ధులను పరిగణనలోకి తీసుకుని ఇంగ్లీష్, హిందీతోపాటుగా తెలుగు, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఎంబీబీఎస్ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ఉండాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు ఎంసీఐ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి రాష్ట్ర విద్యార్ధులకు మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more