ఈ రోజుల్లో హీరోయిన్ పుట్టిన రోజు జరుగుపుకుంటున్న తెలుగమ్మాయికి తెలుగువిశేష్.కామ్ శుభాకాంక్షాలు తెలుస్తోంది. ఈ రోజుల్లో ఈ పిల్ల చాలా హాట్ గురూ. ఇలాంటి పిల్ల దొరకటం కూడా చాలా కష్టమే. ఈ అమ్మాయి మాత్రం ఎప్పటికైనా మేజిస్ట్రేట్ కావాలనే లక్ష్యంతో ఎల్.ఎల్.బి. చదువుతున్న ఆమె నటన మీద ఆసక్తితో మొదట చిన్నితెర మీదా, తర్వాత వెండితెర మీదా అడుగుపెట్టింది. హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా 'ఈ రోజుల్లో'తోనే తన అందచందాలు, అభినయంతో ఆకట్టుకుంది. ఆ అచ్చ తెలుగు అమ్మాయి రేష్మా. ఆమె స్వస్థలం ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు గ్రామం. 'ఈ రోజుల్లో' చిత్రంలో ఆమె చేసిన శ్రేయ పాత్రలో చాలామంది అమ్మాయిలు తమని తాము చూసుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పుడు రెండు సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. వాటిలో ఒకటి ఉదయ్‌కిరణ్ సరసన చేస్తున్న 'జైశ్రీరామ్' కాగా, మరొకటి తన తొలి హీరో శ్రీతో చేస్తున్న 'లవ్ సైకిల్'.
'జైశ్రీరామ్'లో ఆమెది హారిక అనే కాలేజీ స్టూడెంట్ పాత్ర. "నాది బాగా నవ్వించే పాత్ర. హీరోని తరచూ డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. స్ట్రిక్ట్‌గా ఉండే పోలీసాఫీసర్ నాతో ఎలా ప్రేమలో పడ్డాడనేది ఇందులో ప్రధానాంశం. ఇందులో ఆసక్తికరమైన ట్విస్టులున్నాయి. ఉదయ్‌కిరణ్ కొత్తగా కనిపిస్తారు'' అని చెప్పింది రేష్మా. షూటింగ్ పూర్తయిన 'లవ్ సైకిల్'లో శరణ్య అనే పరిణతి చెందిన యువతిగా ఆమె కనిపించనుంది. "ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య పరిణిత ప్రేమకథ ఇది. ఒకర్నొకరు మోసం చేద్దామనుకున్నవాళ్లు ఎలా ప్రేమలో పడ్డారనేది ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది.'ఈ రోజుల్లో'కూ, ఈ సినిమాకూ అసలు పోలికే ఉండదు. ఇందులో తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో నటించడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆయన లాయర్‌గా కనిపిస్తారు. ఆయనతో చేసింది ఒక్క సీనే అయినా మరచిపోలేను'' అని ఆమె తెలిపింది. 'ఈ రోజుల్లో' వంద రోజుల వేడుకలో దాసరి నారాయణరావు ప్రశంసించడం, దిల్ రాజు వంటి నిర్మాత జూనియర్ త్రిష అని సంబోధించడం తనకు లభించిన గౌరవంగా భావిస్తుంది రేష్మా. "నా తొలి సినిమాని త్రిషతోనే చేశా.'బాడీగార్డ్'లో ఆమె స్నేహితుల్లో ఒకరిగా నటించా. అందులో వెంకటేశ్, త్రిష కాంబినేషన్‌లో చేసిన సన్నివేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటాను'' అంటుందామె. అమ్మానాన్నల ప్రోత్సాహం, వారి అండదండలే ఆమె బలం. నాన్న సింగరేణి గనుల్లో ఎగ్జిక్యూటివ్ అయితే అమ్మ అడ్వకేట్. తమ్ముడు ఎం.బి.బి.యస్. చదువుతున్నాడు. సౌందర్య తన అభిమాన తారగా చెప్పే రేష్మా త్వరలోనే మరో సినిమాకి సంతకం చేయబోతోంది. రేష్మాకు మంచి స్టార్ గా ఎదాగాలని తెలుగు అందరు కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more