Sumathi Satakam in Telugu 31110 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ఎప్పుడు సంపద గలిగిన- ఎప్పుడైతే ధనవంతులవుతారో, అప్పుడు- ఆ సమయంలో, బంధువులు వత్తురు- బంధువలు వస్తారు, అది ఎట్లన్నన్- అది ఎలాంటిదంటే, తెప్పలుగ చెరువునిండిన- చెరువులో నీరు బాగా నిండినట్లయితే, కప్పలు పదివేలు చేరు- కప్పలు అందులో పెద్ద సంఖ్యలో చేరతాయి.

Get the Sumathi Satakam చెరువు నిండినప్పుడే కప్పలుంటాయి. అది ఎండిపోతే అందులో కప్పలు కనపడవు. అదేవిధంగా డబ్బులున్నప్పుడే బంధవులు వచ్చి చేరుతుంటారు. ధనమంతా అయిపోయినట్లయితే ఎవరూ దగ్గరకు రారు. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం- 14

Posted: 01/28/2012 03:26 PM IST
Sumati satakam

sumati

ఎప్పుడు సంపద గలిగిన

నప్పుడు బంధువులు వత్తురదియెట్లన్నన్,

దెప్పలుగ చెరువునిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ

ఎప్పుడు సంపద గలిగిన- ఎప్పుడైతే ధనవంతులవుతారో, అప్పుడు- ఆ సమయంలో, బంధువులు వత్తురు- బంధువలు వస్తారు, అది ఎట్లన్నన్- అది ఎలాంటిదంటే, తెప్పలుగ చెరువునిండిన- చెరువులో నీరు బాగా నిండినట్లయితే, కప్పలు పదివేలు చేరు- కప్పలు అందులో పెద్ద సంఖ్యలో చేరతాయి.

చెరువు నిండినప్పుడే కప్పలుంటాయి. అది ఎండిపోతే అందులో కప్పలు కనపడవు. అదేవిధంగా డబ్బులున్నప్పుడే బంధవులు వచ్చి చేరుతుంటారు. ధనమంతా అయిపోయినట్లయితే ఎవరూ దగ్గరకు రారు.

ధనం లేనప్పుడు బంధువులు వచ్చినా వారిని చూసే ఆర్శిక స్తోమతుండదెలాగూ. అలాంటప్పుడు ఎవరూ రాలేదే అని అనుకోవలసిన అవసరం కూడా నిజానికి లేదు. కానీ, ఇక్కడ భౌతికమైన రాకపోకల సంగతి కాదు మాట్లాడుతున్నది. పట్టించుకోవటం గురించి. తక్కువయ్యే ఆదరణ గురించి. లేనివారితో పూసుకుని తిరగటానికి ఇష్టపడేవారు చాలా అరుదు. జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదే అంటారు అందుకే. బంధువులు, మిత్రులు, చుట్టాలు, పక్కాలు అంతా మీ వలన ఏదైనా లాభం ఉంటుందనుకుంటేనే మీ దగ్గరకు చేరతారు. అవసరం తీరిపోగానే, ఇక మీరు వాళ్ళకి పనికిరారని తెలియగానే మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. అందువలన, నాకు ఇంత బలగం ఉంది అన్న గర్వం రానివ్వవద్దని ఆచార్యులు హెచ్చరిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati satakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more