రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రస్తుతం ప్రణబ్‌కు 63 శాతం ఓటర్ల బలం ఉండగా, ప్రత్యర్థి పిఏ సంగ్మాకు 30 శాతం ఓట్ల బలం ఉంది. నామినేషన్ అనంతరం ప్రణబ్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ యుపీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడం గర్వంగా ఉందని, రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించడం తనకు ఎంత గౌరవప్రదమని ఆయన అన్నారు.తమకు మద్దతు తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. యుపిఎలో లేని పార్టీ మద్దతు కూడా తనకు ఉందని చెప్పారు.
బీజేపీ నేతలు ఎల్‌కే అద్వానీ, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడులు వెంటరాగా రాష్ట్రపతి అభ్యర్ధిగా పిఏ సంగ్మా గురువారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. తనకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోందని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గిరిజన నేతలు తనకు మద్దతు పలకాలని సంగ్మా కోరారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more