వైఎస్ కుటుంబం 1978లో రాజకీయాల్లోకి వచ్చిందన్నారు. వైఎస్ రాజారెడ్డి పలుకేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, మంత్రిగా ఉన్న తన తండ్రిని ఆశ్రయించారన్నారు. రాష్ట్రంలో వైఎస్ కుటుంబం కన్నా తమ కుటుంబమే రాజకీయాల్లోకి ముందుగా ప్రవేశించిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తమ కుటుంబానికి పట్టలేదన్నారు. వైఎస్ తండ్రి రాజారెడ్డిని పలు కేసులనుంచి తన తండ్రి అమర్నాథ్రెడ్డి కాపాడారని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సుండుపల్లెలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తన తండ్రి అమర్నాథరెడ్డి 1962లో రాజకీయ అరంగ్రేటం చేసి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పని చేశారన్నారు. పలుమార్లు తన తండ్రిని ప్రజలు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని కిరణ్ నొక్కి చెప్పారు. ఆ సమయంలో తమ బంధువు పోలీసు ఉన్నతాధికారిగా ఉండటం, అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో తన తండ్రికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా రాజారెడ్డిని రక్షించినట్టు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దయాదాక్షిణ్యాల వల్ల తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో తాను, రాజశేఖరరెడ్డి రాజకీయాల్లో రాణించామని కిరణ్ గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more