తెలంగాణ కోసం అమరుడైన విద్యార్థి వార్తకు సముచిత ప్రాధాన్యమివ్వని ఈనాడు దినపత్రికపై తెలంగాణ హాకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమవార్తలకు ఆ పత్రిక ప్రాధాన్యమివ్వడం లేదని పేర్కొంటూ రంగాడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని హాకర్లు, తెలంగాణవాదులు బాలాపూర్ చౌరస్తా వద్ద ‘ఈనాడు’ ప్రతులను దహనం చేశారు. ఆ పత్రికను బహిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ వాస్తవాలు రాయకుండా తెలంగాణకు వ్యతిరేక వార్తలు ప్రముఖంగా ప్రచురించేది ‘ఈనాడు’ అని, దాని తీరుతో విసిగిపోయామని మండిపడ్డారు. ఉద్యమం ఉధృతమవుతున్న ప్రతిసారీ సీమాంధ్ర పత్రికలు విషం కక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు మీర్‌పేట రాజు, అర్జున్‌డ్డి, వీవీ రెడ్డి, శ్రీనివాస్, యాదగిరి మాట్లాడారు. భోజ్యానాయక్ ఆత్మహత్య చేసుకుంటే ‘ఈనాడు’ అవహేళన చేసినట్లు వార్తకు సముచిత స్థానం కల్పించలేదన్నారు. తెలంగాణ విద్యార్థి అమరుల త్యాగాలను పతాక శీర్షికలో రాయనంత కాలం ఆ పత్రికను బహిష్కరిస్తామని, ఈ బహిష్కరణ ఉండనుందని తెలిపారు. ఈనాడు పేపర్లు వేసే కేంద్రాలు ఎక్కడుంటే అక్కడ నిరసనలు, ధర్నాలు చేపడతామన్నారు. సంతోష్‌నగర్, చంపాపేట, బాలాపూర్ చౌరస్తా, మీర్‌పేట చౌరస్తాల పరిధిల్లోనే కాకుండా ఎక్కడ ఈనాడు పత్రికలు వేసే కేంద్రాల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more