Cong leader takes poison after denied ticket టిక్కెట్ దక్కలేదని కాంగ్రెస్ నేత ఇలా..

Congress leader attempts suicide after denied assembly ticket

Madhya Pradesh Assembly Elections 2018, prem singh kushwaha, Madhya Pradesh assembly polls, Madhya Pradesh assembly elections, Madhavrao Scindia, Madan Singh Kushwah, Congress leader, Cong general secretary, media, crime

Denied a ticket, a former state Congress general secretary attempted suicide in front of Madhavrao Scindia’s bust in Gwalior. Prem Singh Kushwah swallowed poison and his condition was said to be stable.

టికెట్ కోసం విషం మింగిన నేత.. తప్పిన ప్రాణాపాయం

Posted: 11/10/2018 05:38 PM IST
Congress leader attempts suicide after denied assembly ticket

మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపకాలు వ్యవహారంతో విసిగివేసారిన ఓ ఆశావహుడు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. పార్టీ అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆశావహుడు.. పార్టీ రాష్ట్రస్థాయి నేత మాధవరావు సింధియా ఎదుటే విషం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే పార్టీ కోసం తాను ఎంతోకాలంగా కష్టపడి పనిచేస్తుంటే.. తనకు టికెట్ కేటాయించపోవడంపై ఆయన తన నిరసనను ఇలా వ్యక్తం చేశారు.

అక్కడే వున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆయనను హుటాహుటిన అస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. గ్వాలియర్ కు చెందిన కాంగ్రెస్ నేత, జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ అయిన ప్రేమ్‌సింగ్ కుస్వాహ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీని కాపాడుకుంటూ.. కార్యకర్తలకు నిత్యం అండగా నిలుస్తూ వచ్చిన తనకు అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశం కల్పించకపోవడం ఏంటని ఆయన  ప్రశ్నించారు.

ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్ఠానం దక్షిణ గ్వాలియర్ సీటును సురేశ్ చౌదరికి కేటాయించింది. తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ్‌సింగ్.. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను బహిరంగంగా ప్రజావేదికలపైనే తిట్టేసి.. ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ లోకి వచ్చిన బీఎస్పీ నేతలకు అవకాశం కల్పించడమేంటని నిలదీసిన ఆయన మాధవరావు సింధియా విగ్రహం ఎదుట విషం తీసుకున్నారు. సకాలంలో నేతలు స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, దక్షిణ గ్వాలియర్ లేదంటే తూర్పు గ్వాలియర్ నుంచి తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని గత కొంత కాలంగా ప్రేమ్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles