Sadhvi Prachi calls Shah Rukh Khan a Pakistani agent

Sadhvi prachi calls shah rukh khan a pakistani agent

Sharukh Khan, Sadhvi, Pakistani agent, intolerance, Pakistan, Sadhvi Prachi

Sadhvi Prachi, a VHP leader triggered another controversy by calling Superstar, Shah Rukh Khan a “Pakistani agent” for his remarks on “intolerance” yesterday.She also slammed the actor for saying that religious intolerance in the country won’t let it grow and become a superpower. She said that for his statement, SRK should be charged with sedition and sent to Pakistan

షారుఖ్ ఖాన్ పాకిస్థాన్ ఏజెంట్

Posted: 11/03/2015 10:26 AM IST
Sadhvi prachi calls shah rukh khan a pakistani agent

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మీద సాధ్వి ప్రాచి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా దేశంలో జరుగుతున్న పరిణామాల మీద స్పందిస్తూ హింస మీద మాట్లాడారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న హింస తీవ్ర కలకలాన్ని రేపుతోందని అన్నారు.దేశంలో రోజురోజుకు తలెత్తుతున్న హింస మీద, దానికి నిరసనగా చాలా మంది కళాకారులు తమ అవార్డులను వెనక్కి ఇవ్వడం మీద షారుఖ్ ఖాన్ స్పందించారు. తాను కూడా అలా చెయ్యగలనని.. కానీ తనకు ఇష్టం లేదని అన్నారు. దేశంలో భావప్రకటన స్వేచ్ఛ మీద మాట్లాడగలనని.. కానీ అలా మాట్లాడితే తన ఇంటి మీద రాళ్ల దాడి జరుగుతుందని కూడా షారుఖ్ అన్నారు. అయితే షారుఖ్ మాటల మీద సాధ్వి ప్రాచి మండిపడ్డారు.

షారుఖ్ ఖాన్ పాకిస్థాన్ ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారని.. దేశంలో హింస గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారని మండిపడింది. దేశంలో తలెత్తుతున్న హింస తనకు కూడా అసహనం కలిగించిందని షారుఖ్ ఖాన్ అన్నారు. అయితే దీని మీద సాధ్వి విరుచుకుపడ్డారు. సారుఖ్ పాకిస్థాన్ ఏజెంట్ గా మాట్లాడుతున్నారని.. అతడిని పాక్ కు పంపించాలని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తానికి షారుఖ్ ఖాన్ తన పుట్టిన రోజు చేసిన వ్యాఖ్యల మీద కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharukh Khan  Sadhvi  Pakistani agent  intolerance  Pakistan  Sadhvi Prachi  

Other Articles