Woman player attacks opponent with hockey stick ఆట మధ్యలో హాకీస్టిక్స్ తో కొట్టేసుకున్న అమ్మాయిలు

Viral video woman hockey player attacked opponent player with stick during the match

hockey team players, hockey players fight during match, meerut kolkatta teams fight during hockey match, All India hockey women's tournament, meerut team, kolkatta team, shivani, mamata, hockey stick, sports, hockey news, sports news, viral video, social media

In a shocking incident, a woman hockey player attacked an opponent player with the hockey stick in the middle of the tournament and created a ruckus. The unprecedented incident took place during the All India Hockey Women tournament. Meerut and Kolkata teams locked horns in the final match to win the title.

ఆట మధ్యలో హాకీస్టిక్స్ తో కొట్టేసుకున్న అమ్మాయిలు

Posted: 11/30/2021 08:24 PM IST
Viral video woman hockey player attacked opponent player with stick during the match

ఆల్​ ఇండియా హాకీ టోర్నమెంట్​లో షాకింగ్​ ఘటన జరిగింది. టోర్ని నిర్వహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంత హాకీ మన జాతీయ క్రీడ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఆటలో ప్రభావం చూపాలే కానీ.. వారిపై దాడి చేసి కాదు కదా.. అని అంటారా. సర్లే ఎంతైనా యువకులు.. అవేశకామేశాలకు పోయి మ్యాచ్ ను రద్దు చేసుకున్నారు అంటారా.. అయితే మీకు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఆల్ ఇండియా హాకీ మహిళా టోర్నమెంటు. అంటే హాకీ స్టిక్​తో ఆట మధ్యలో కొట్టేసుకుంది మహిళా క్రీడాకారులే అంటే నమ్మశక్యంగా లేదా. కానీ ఇదే నిజం.

ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ నగరంలో ఆల్ ఇండియా హాకీ ఉమెన్స్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇవాళ ఆటలో భాగంగా అటు మీరట్, కోల్ కతా జట్టు తలపడ్డాయి. ఆటలో భాగంగా బింతిని చేజ్ చేసుకుంటూ వెళ్తున్న మీరట్ క్రీడాకారిణి శివాణిని.. మమత అనే కోల్ కతా క్రీడాకారిణి ఎంతగానో ప్రయత్నించి చివరకు అడ్డుకుంది. అయితే అమె అడ్డుకోవడంతో శివాణీ తన హాకీ స్టిక్ ను మమతకు తగిలేలా చేసింది. ఏకంగా మమత ముఖం​పై హాకీ స్టిక్ తగలడంలో.. క్షణికావేశానికి లోనైన మమత.. శివాణిని తన హాకీ స్టిక్ తో బలంగా కుడి భుజంపై కొట్టింది.

అంతే దెబ్బ బలంగా తగలడంతో శివాణి అక్కడే గ్రౌండ్ లో పడిపోయింది. ఈ హాఠాణ్పరిణామాన్ని ఊహించని ఇరువైపుల క్రీడాకారులు వచ్చి ఒకరితో మరోకరు వాదనకు దిగారు. ఈ అనూహ్యపరిణామాలతో ఖంగుతిన్న టోర్నీ నిర్వాహకులు కూడా వెంటనే గ్రౌండ్ లోకి వచ్చి పరిస్థితిని సమీక్షించి.. వెంటనే ఆటను కూడా రద్దు చేశారు. గాయపడిన మీరట్ క్రీడాకారిణి శివాణిని నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. కాగా క్రీడాకారులపై దాడికి కారణమైన పరిస్థితులపై నిర్వాహకులు దర్యాప్తు చేస్తున్నారు. దోషులకు అట నుంచి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles