Junior Hockey World Cup LIVE - India thumps Canada 13-1 హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్: కెనడాపై భారత్ వీరవిహారం

Fih men s junior world cup sanjay hundal score hat tricks as india crush canada 13 1 to register first win

Junior Hockey World Cup, India, Canada, France, vivek sagar prasad, Team India, shardanand tiwari, junior hockey world cup 2021, FIH Mens Junior World Cup, bhubaneshwar, abhishek lakra, Hockey news, sports news, Hockey, sports

Vice-captain Sanjay scored a second consecutive hat-trick while Araijeet Singh Hundal too found the net thrice as defending champions India bounced back strongly to demolish Canada 13-1 in their second Pool B match of the FIH Men's Junior Hockey World Cup.

హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్: కెనడాపై భారత్ వీరవిహారం

Posted: 11/26/2021 12:04 PM IST
Fih men s junior world cup sanjay hundal score hat tricks as india crush canada 13 1 to register first win

జూనియర్‌ హాకీ ప్రపంచ కప్‌లో భారత హాకీ జూనియర్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్ లో ఫ్రాన్స్‌ చేతిలో పరాభవం ఎదురుకావడాన్ని జీర్ణంచుకోలేని జట్టు.. తన రెండో మ్యాచ్ లో విజయాన్ని నమోదు చేసుకుంది. ఓటమి గాయం నుంచి త్వరగానే కోలుకున్న భారత జూనియర్‌ హాకీ జట్టు.. 24 గంటల వ్యవధిలో జరిగిన మరో మ్యాచులో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి ఘన విజయాన్ని అందుకుని తన విజయపు ఖాతాను అవిష్కరించింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచులో ఆద్యంతం టీమిండియా జూనియర్ జట్టు అధిపత్యం ప్రదర్శించింది.

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో భారత్‌ 13–1 గోల్స్‌ తేడాతో కెనడాను చిత్తు చేసింది. భారత్‌ ఆటగాళ్లలో వైస్ కెప్టన్ సంజయ్‌ (17, 32, 59వ నిమిషాల్లో) హ్యాటిక్ గోల్స్ కోట్టగా, అదే ఒరవడిలో అరైజీత్‌ సింగ్‌ (40, 50, 51వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించారు. దీంతో ఢిపెండింగ్ ఛాంపియన్స్ గా వున్న భారత్ మరోమారు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. ఉత్తమ్‌ సింగ్‌ (16, 47వ నిమిషాల్లో), శర్దానంద్‌ (35, 53వ నిమిషాల్లో)లు రెండు గోల్స్‌ చొప్పున చేయ గా... కెప్టెన్‌ వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (8వ నిమిషంలో), మణీందర్‌ సింగ్‌ (27వ నిమిషం లో), అభిషేక్‌ లాక్రా (55వ నిమిషంలో) తలా ఓ గోల్‌ చేసి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్‌ (30వ నిమిషంలో)ను క్రిస్టోఫర్‌ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior Hockey World Cup  India  Canada  France  Hockey  sports  

Other Articles