Inderjeet fails B sample test also, Rio hopes virtually over

Inderjeet singh s b sample also positive rio hopes diminish

inderjeet singh, Indiaయ shot-put athlete, ‘B’ sample positive, inderjeet singh, inderjeet, inderjeet singh india, rio 2016, rio 2016 olympics, Rio olympics, olympics 2016, sports news, sports

India shot-put athlete Inderjeet Singh’s chances of making it to Rio, his ‘B’ ssÁaample athlete has also been found positive. This lessen his chances to go to Rio and represent India.

రియో నుంచి ఇండియన్ షార్ట్ పుట్ ఇంద్రజీత్ సింగ్ ఔట్.?

Posted: 08/02/2016 05:41 PM IST
Inderjeet singh s b sample also positive rio hopes diminish

భారత షాట్ పుట్ ఆటగాడు ఇందర్ జిత్ సింగ్.. రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రమారమి ఇండియన్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తరహాలోనే ఇందర్ జిత్ సింగ్ కూడా తొలి డోపింగ్ టెస్టులో విఫలం అయ్యాడు. అయితే ఇందర్ జిత్ కూడా తనపై ఏదో కుట్ర జరిగిందని అరోపించాడు, ఈ నేపథ్యంలోనే రెండోసారి సేకరించిన శాంపిల్స్ ఫలితాల్లో కూడా అతను నిషేధిత డ్రగ్స్ వాడినట్లు తేలింది. దీంతో  జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన ఇందర్ జిత్ బి'శాంపిల్ ఫలితంలోనూ ఆయన విఫలమయ్యాడు, దీంతో అతని రియో అవకాశాలకు తెరపడినట్లే కనబడుతోంది.

గత నెల 22వ తేదీన ఇందర్ జిత్ కు నిర్వహించిన డోపింగ్ టెస్టులో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. కాగా, డోపింగ్ కు తాను పాల్పడలేదని ఇందర్ జిత్ స్పష్టం చేశాడు. ఎవరో చేసిన కుట్రలో తాను బలయ్యానంటూ నాడాకు విన్నవించాడు. అయితే రెండోసారి శాంపిల్ను తీసుకుని పరీక్షించినా ఫలితం పాజిటివ్ గానే వచ్చింది.  దీంతో అతని రియో భవితవ్యం ప్రశ్నార్ధకరంగా మారింది.

గతేడాది ఆసియన్ చాంపియన్ షిప్లో  స్వర్ణం సాధించిన ఇందర్ జిత్ రియోకు అర్హత సాధించాడు. దీంతో రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2014లో ఇంచియాన్లో జరిగిన ఆసియన్ గేమ్స్  లో ఇందర్ జిత్ ఆకట్టుకుని కాంస్య పతకం సాధించాడు. అయితే ఇప్పుడు ఇందర్ జిత్ డోపింగ్ లో పట్టుబడటంతో అతని పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తుంది. . ఒకవేళ డోపింగ్ ఉదంతంలో దోషిగా తేలితే మాత్రం అతని కెరీర్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles