narsingh yadav hopeful NADA verdict in his favour

Narsingh yadav hopeful of a favourable verdict

narsingh yadav, narsingh yadav doping, narsingh yadav doping test, NADA, wrestler, Rio Olympics, Praveen Rana, NADA, IOA, WFI, doping case, narsingh yadav sports authority of india, narsingh yadav sai, narsingh yadav vijay goel, vijay goel, vijay goel sports minister, pm modi, narendra modi, rio 2016 olympics, rio olympics, rio 2016, rio, olympics, wrestling

Narsingh will get a ban of two to four years after his 'A' and 'B' samples tested positive for a banned steroid by NADA.The distraught wrestler will get to know his fate very soon.

నాడా సానుకూల తీర్పును వెలువరిస్తుంది: నర్సింగ్ యాదవ్ ధీమా

Posted: 07/29/2016 08:56 PM IST
Narsingh yadav hopeful of a favourable verdict

భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రెండు డోపింగ్ టెస్టుల్లోనూ దొరకిపోడంతో ఆయన రియో ఒలంపిక్స్ వెళ్లడంపై ఇంకా నీలినీడలు కమ్ముకున్నప్పటికీ.. రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అంశంపై ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంలో నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కు తగిన ఆధారాలు సమర్పించడంలో విఫలమైన నర్సింగ్ యాదవ్.. తనకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నాడు. నర్సింగ్ యాదవ్కు అనుకూలంగా నిర్ణయం వస్తే అతన్ని రియోకు పంపించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతా కూడా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో నాడాపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంలో తన ప్రమేయం లేదని అన్నారు. కుట్ర పూరితంగానే జరిగిందని భావిస్తున్నానని చెప్పారు. ఇదే విషయాన్ని నాడాకు తెలియజేశామన్నారు. డోపింగ్ వ్యవహారంలో జరిగిన వాస్తవాన్ని నాడాకు వివరించానని అన్నారు. ఇక వారి నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నా. నాకు నమ్మకం ఉంది. ప్యానల్ నుంచి నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని బలంగా నమ్ముతున్నా'అని నర్సింగ్ పేర్కొన్నాడు.

గురువారం కూడా విచారణకు హాజరైన నర్సింగ్ తరఫు న్యాయవాదులు డోప్ పరీక్ష ఫలితాలపై తమ వాదనలను వినిపించారు. దీనిపై సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే నర్సింగ్ యాదవ్ ఏదైతే వాదిస్తున్నాడో దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేదని నాడా న్యాయవాది గౌరాంగ్ కాంత్ తెలిపారు. దీంతో రియో ఒలింపిక్స్ లో నర్సింగ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవైపు నర్సింగ్ తన రియో ఆశలపై నమ్మకం వ్యక్తం చేస్తుండగా.. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిబంధనల ప్రకారం ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narsing Yadav  NADA  wrestler  Rio Olympics  Praveen Rana  NADA  IOA  WFI  doping case  

Other Articles