saina nehwal climbs endorsement charts after badminton ratings

Saina nehwal inching closer to ms dhoni virat kohli in endorsement deals

saina inching closer to MS Dhoni & Virat Kohli, saina endorsement deals nearing dhoni, kohli, saina nehwal endorsemenr deals, world number one shuttler Saina Nehwal, Saina Nehwal, endorsement deals, MS Dhoni, Virat Kohli, badminton, latest badminton news

After tasting big success on the badminton court, world number one shuttler Saina Nehwal is touching new heights in the endorsement market inching closer to cricket stars MS Dhoni and Virat Kohli.

బ్రాండ్ వ్యాల్యూలో ధోని, విరాట్ ల సరసన సైనా..!

Posted: 09/05/2015 07:12 PM IST
Saina nehwal inching closer to ms dhoni virat kohli in endorsement deals

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్కు.. ఓ వైపు ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడంతో పాటు, మరో వైపు తన బ్రాండ్ వ్యాల్యూ కూడా గణనీయంగానే పెరుగుతోంది. ఇటీవల వరుస విజయాలతో ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్.. పెద్ద సంఖ్యలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఓ వ్యాపార ప్రకటన కోసం 12 కోట్ల రూపాయల ఒప్పందం సైనాను వరించింది. ఏడాదికి 4 కోట్ల రూపాయలు ఆమెకు ఇవ్వనున్నారు. టాప్ క్రికెటర్ల తర్వాత ఇంత భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్న తొలి క్రీడాకారిణి సైనానే కావడం విశేషం.

భారత్ ఏస్ షట్లర్ గా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న సైనా ఇటు వాణిజ్య ఓప్పందాలలో.. స్టార్ క్రికెటర్లు ధోనీ, విరాట్ కొహ్లీ వారి సరసన చేరింది. మార్కెట్ వర్గాల కథనం మేరకు ధోనీ ఒక బ్రాండ్ ప్రచారం కోసం ఏడాదికి 8 నుంచి 10 కోట్లు తీసుకుంటుండగా.. విరాట్ కొహ్లీ 6-7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడేళ్లలో సైనా ఎండార్స్మెంట్ల ద్వారా భారీ మొత్తం ఆర్జించనుంది. నిన్న మొన్నటి వరకూ దాదాపు 10 ఎండార్స్ మెంట్స్ ద్వారా ఏడాదికి 5 నుంచి 7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సైనా బ్రాండ్ వాల్యూ ఇటీవల అనూహ్యంగా పెరిగింది.

హెర్బల్ లైఫ్, స్టార్ స్పోర్ట్స్, గోద్రేజ్, ఇమానీ, సహారా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐయోడెక్స్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సైనా.. ఎడెల్ వీస్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనుంది. మరో వైపు ఈ ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేస్తోంది. ప్రైజ్ మనీ, వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చిన డబ్బుతో బిజినెస్ చేయాలని యోచిస్తోంది. అయితే తనకు బ్యాడ్మింటన్ తప్ప మరో విషయం తెలియదని.. వ్యాపార విషయాలన్నీ తన తండ్రి చూసుకుంటారని వివరించింది. తాను డబ్బుల గురించి ఆలోచించనని.. తన దృష్టి అంతా ఆటమీదే ఉందని చెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  badminton  endorsement deals  MS Dhoni  Virat Kohli  

Other Articles