Danny Jones Keighley player dies after cardiac arrest during game | cardiac-arrest

Danny jones keighley player dies after cardiac arrest during game

Danny Jones News, Danny Jones dead, Danny Jones updates, rugby league, Danny Jones rugby player, Keighley Cougars rugby, cardiac arrest

Danny Jones Keighley player dies after cardiac arrest during game : Keighley Cougars rugby league player Danny Jones has died after suffering a suspected cardiac arrest during a game.

క్రీడాలోకాన్ని మళ్లీ విషాదంలో ముంచెత్తిన ‘గుండెపోటు’

Posted: 05/04/2015 06:34 PM IST
Danny jones keighley player dies after cardiac arrest during game

గతకొన్నాళ్ల నుంచి క్రీడాకారులు వరుసగా హఠాన్మరణం పాలవుతున్న ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. ఆమధ్య క్రికెట్ మైదానంలో తలకు బంతి తగిలి అక్కడికక్కడే ఫిలిప్ హ్యూస్ కుప్పకూలగా.. మరో క్రికెటర్ అంకిత్ కేసరి అదేవిధంగా ప్రాణాలి వదిలాడు. అలాగే మొన్న ఫుట్ బాల్ మైదానంలో రెండు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన నెట్ బాల్ క్రీడాకారుడు మయూరేష్ పవార్ గుండెపోటుతో మరణించగా, బెల్జియన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు గ్రగరీ మెర్టెన్స్ ఆటమధ్యలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. ఇప్పుడు తాజాగా ఓ రగ్బీ ప్లేయర్ మైదానంలోనే గుండెపోటుతో మరణించడంతో క్రీడాలోకంలో విషాదం చోటు చేసుకుంది.

లండన్ లోని ది వేల్స్ ఇంటర్నేషనల్ రగ్బీ ఛాంపియన్ షిప్ లో ఎంతో చురుకుగా పాల్గొన్న డేనీ జోన్స్ (29) ఆటగాడు.. మొదట్లో చురుకుగా తన ప్రతిభను కనబరిచాడు. ఆదివారం జరిగిన మ్యాచులో అతగాడు ప్రత్యర్థి ఆటగాళ్లను బాగానే ఎదురించాడు. అయితే.. ఆట జరుగుతుండగానే వున్నట్లుండి డేనీ మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడికి వెంటనే ప్రాథమిక చికిత్స నిర్వహించి.. అక్కడి నుంచి తక్షణమే రాయల్ ఫ్రీ ఆసుపత్రికి తరలించారు. అయినా.. ఫలితం లేకుండాపోయింది. ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఇతడి మృతితో బ్రిటన్ రగ్బీ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danny Jones  rugby league  Keighley Cougars  

Other Articles