PV sindhu and 6 others for khel ratna award

7 contenders for rajiv gandhi khel ratna

Badminton star PV Sindhu, Indian hockey team skipper Sardar Singh, Sports Ministry, Khel Ratna award, Asian and Commonwealth Games medallist Tintu Luka, Incheon gold medallist Dipika Pallikal, silver medallist Paralympics, Girisha Hosanagara Nagarajegowda, first-time nominees, golfer Jeev Milkha Singh, Paralympian Devendra Jhajariya

Badminton star PV Sindhu and Indian hockey team skipper Sardar Singh have forwarded their applications to the Sports Ministry for the Khel Ratna award this year.

ఖేల్ రత్న రేసులో పీవీ సింధూ, సర్థార్ సింగ్

Posted: 05/02/2015 05:52 PM IST
7 contenders for rajiv gandhi khel ratna

స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు భారత అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న రేసులో మరోసారి నిలిచింది. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు పలు టార్నోమెంట్లలో తన ప్రతిభను కనబర్చిన పీవీ సింధు.. పలు విజాయాలను సోంతం చేసకుంది. తన సీనీయర్ ఏస్ షెట్లర్ సైనా బాటలోనే పయనిస్తూ.. మున్ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ సమాఖ్య సింధు పేరును ఖేల్ రత్న అవార్డకు సిఫార్సు చేసింది. పీవీ సిందూతో పాటుగా హాకీ జట్టుకు చెందిన కెప్టెన్ సర్దార్ సింగ్ పేరు కూడా ఈ ఏడాది అవార్డు కోసం పరిశీలనతో వుంది. వీరిద్దరూ ఇప్పటికే తమ ధరఖాస్తునలు క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించారు.

వీరితో పాటు ఆగస్టు 29న హకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని క్రీడారంగాలను చెందిన ప్రముఖులకు అందించే అత్యుత్తమ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులకు ఏసియన్, కామన్ వెల్త్ గేమ్స్ మెడలిస్టు టింటూ లూక (అథ్లెటిక్స్), ఇంచియాన్ స్వర్ణ పతాక విజేత దీపికా పల్లికల్ (స్క్వాష్), ఇంచియాన్ రజత పతక విజేత గిరీష హోసనగర (పారాలింపిక్స్) పేర్లను తొలిసారిగా ఖేల్ రత్న అవార్డలకు ప్రతిపాదించారు. వీరితో పాటు జీవ్ మిల్కాసింగ్ (గోల్ఫ్), దేవేంద్ర జజారియ (పారాలింపిక్స్) కూడా పోటీపడనున్నారు. సింధు, జీవ్, దేవేంద్ర నిరుడూ ఖేల్‌రత్న రేసులో నిలిచారు. ఐతే.. కపిల్‌దేవ్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ ఎవరినీ ఎంపిక చేయలేదు.

కాగా ఈ సారి రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు ఎవరి పేరును బీసీసీఐ ప్రతిపాదించలేదు. కాగా క్రీడాకారులకు అభించే అత్యున్నత పురస్కారం అర్జున అవార్డుకు గత ఏడాది రెండు పర్యాయాలు డబుల్ సెంచరీలతో అదరగోట్టిన రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Sardar Singh  Sports Ministry  Khel Ratna award  

Other Articles