Egypt cairo stadium police gunfire football fans died

egypt football fire, egypt football clashes, football fans police clashes, egyptians died, football controversies, egypt football gunfire, football fans clashes, egypt cairo football stadium, cairo football stadium fire

egypt cairo stadium police gunfire football fans died : In Egypt cairo football stadium.. The clashes held between football fans and police security.

ఫుట్ బాల్ స్టేడియంలో దారుణం.. 25 మంది మృతి!

Posted: 02/09/2015 03:31 PM IST
Egypt cairo stadium police gunfire football fans died

అప్పటివరకు ఆ ఫుట్ బాల్ స్టేడియం ఎంతో ఆహ్లాదకరంగా వుండేది.. అందరూ ఎంతో ఉత్కంఠభరింతగా మ్యాచ్ సందర్శిస్తున్నారు.. రెండుజట్ల మధ్య జరుగుతున్న ఆ మ్యాచ్ ఆటగాళ్లలో ఉత్సాహం పెంచేందుకు అభిమానులంతా తమతమ జట్ల తరఫున నినాదాలు చేస్తున్నారు.. అంతా సవ్యంగానే వుండేది.. కానీ ఇంతలోనే దురదృష్టం ఆవహించింది. అనుకోకుండా ఏర్పడిన ఒక చిన్న ఘర్షణ.. 25 మంది ప్రాణాలను బలితీసేసుకుంది. అప్పటివరకు సంతోషంగా వుండే ఆ వాతావరణమంతా విషాదంగా మారిపోయింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగింది ఈ ఘటన!

ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఎయిర్ డిఫెన్స్ ఫుల్’బాల్ స్టేడియంలో లీగ్ క్లబ్ జమేలక్, ఈఎస్ పీపీఐ మధ్య మ్యాచ్ జరుగుతుండేది. ఈ మ్యాచ్ ప్రారంభం అయ్యేముందు అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగానే వుండేది. అయితే ఈ మ్యాచ్’ను వీక్షేందుకు వచ్చిన 10 వేలమంది ఫుట్ బాల్ అభిమానులు మాత్రం టిక్కెట్లు లేకుండానే లోపలికి చొరబడ్డానికి ప్రయత్నించారు. దీంతో అక్కడున్న భద్రతా దళాలు వారిని అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని వాళ్లంతా ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అభిమానులు.. ఆ భద్రతాదళాలపై తిరగబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ ఘటనలో 25 మంది మరణించగా.. 35 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆందోళనకారులు అక్కడున్న పలు వాహనాలకు నిప్పుపెట్టారు. స్టేడియం లోపల కూడా ఘర్షణ జరిగింది. కొందమంది అభిమానులు ఆట జరుగుతున్న స్టేడియంలోనే నిప్పు పెట్టేశారు. దీంతో అలర్టైన భద్రతాసిబ్బంది.. ఆటగాళ్లను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించి, ఆందోళన కారులను అడ్డుకున్నారు. ఈ తొక్కీసలాటలో మరెందమంది గాయపడ్డారో ఇంకా ఖచ్చితమైన వార్తలు తెలియరాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : egypt cairo football stadium fire news  football fans police clashes  

Other Articles