Badminton association general secretary punnaiah warns saina nehwal court issue

saina nehwal news, saina nehwal court news, saina nehwal photo shoot, saina nehwal badminton game, saina nehwal photos, saina nehwal national games, Punnaiah, Badminton Association General Secretary punnaiah news, national championship tournaments

Badminton Association General Secretary punnaiah warns saina nehwal court issue : The General Secretary Badminton Association told that they will go court to complaint on saina nehwal for stay away from national championship tournaments

సైనాపై కోర్టుకెళతాం : బ్యాడ్మింటన్ సంఘం

Posted: 02/02/2015 12:27 PM IST
Badminton association general secretary punnaiah warns saina nehwal court issue

బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్’పై బ్యాడ్మింటన్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యవహరిస్తున్న తీరు చాలా అసంతృప్తికి గురిచేస్తోందని ఆమెపై కోర్టుకెళ్లేందుకు సంఘం సిద్ధమైంది. నిబంధనలను వ్యతిరేకంగా సైనా నెహ్వాల్ అభిప్రాయాలు తీసుకుంటోందని, అందుకే ఆమెపై చర్యలు తీసుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కుతామంటూ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి పున్నయ్య చౌదరి తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే... భారత్’లో జరిగే దేశవాళీ టోర్నమెంట్’లకు దేశానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారులంతా ఆడాలనే నిబంధన ఎప్పటినుంచో వుంది. అయితే.. సైనా నెహ్వాల్ మాత్రం ఈ టోర్నమెంట్’లకు దూరంగా వుంటోంది. అంతేకాదు.. జాతీయ సీనియర్ చాంఫియన్ షిప్ లో పాల్గొనాలని ఆమెకు ఇదివరకే నాలుగుసార్లు మెయిల్ పంపించినా.. ఆమె నుంచి కనీస స్పందన కూడా రాలేదని పున్నయ్య తెలిపారు. సైనా ఈ టోర్నమెంట్’కు విరుదద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అందుకే.. ఆమెపై కోర్టుకెళ్తామని ఆయన తెలిపారు.

ఈ దేశవాళీ టోర్నమెంట్లలో స్టార్ ప్లేయర్లు పాల్గొనకపోతే స్పాన్సర్లు రాకుండా పోతారని.. అలాగే ఆటకు ఆదరణ కూడా తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపిన ఆయన.. ఇదే విషయమై కోర్టు దృష్టికి తీసుకెళతామని అన్నారు. టోర్నీలకు దూరంగా వుండే క్రీడాకారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి సూచించేలా కోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. మరి.. దీనిపై సైనా ఎలా స్పందించనుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal court issue  General Secretary punnaiah  badminton association  

Other Articles